జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు.