
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన ఆస్తులు, తన బినామీల భూములు కాపాడుకోవడానికే జనం ముందుకు జోలె పట్టుకుని వస్తున్నారని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులను కాపాడుకోవడానికి తన భార్యతో ఓ ప్లాటినం గాజును వేయించి.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, రైతుల వద్ద విరాళాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వారి జీతాలను గానీ, ఇంటి అద్దె అలవెన్సును గానీ రైతుల ఉద్యమానికి విరాళంగా ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment