రేపు జాతీయ మెగా లోక్‌అదాలత్
Published Thu, Oct 6 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
నిజామాబాద్ లీగల్ :
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముడియం వెంకట హరినాథ్ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా న్యాయపరమైన సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జాతీయ మెగా లోక్ అదాలత్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని సబ్‌కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి సుజన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి లోక్‌అదాలత్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, పెట్టి కేసులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు పరిష్కరిస్తామన్నారు. జిల్లా కోర్టుతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి సబ్ కోర్టులలో న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement