Senior civil judge
-
ఏపీలో సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ సివిల్ జడ్జీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో 16 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు చోటు దక్కింది. పదోన్నతి పొందిన సీనియర్ సివిల్ జడ్జీల జాబితా.. 1. కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం మెజెస్ 2. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న వి నరేష్ 3. తూర్ప గోదావరి జిల్లా కాకినాడ ప్రన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న అమ్మనరాజా 4. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న ఆర్ శరత్‌బాబు 5. అనంతపురం జిల్లా కదిరి సీనియర్ సివిల్ జడ్జి ఎస్ రమణయ్య 6. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పి వాసు 7. విజయనగరం జిల్లా విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జి కె రాంబాబు 8. ప్రకాశం జిల్లా పర్చూరు సీనియర్ సివిల్ జడ్జి షేక్ మహమ్మద్ ఫజుల్లా 9. గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి లక్ష్మి 10. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి ఏడుకొండలు 11. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జి వీఎస్ఎస్ శ్రీనివాస శర్మ 12. కడప జిల్లా డిస్ట్రిక్ లెవల్ సర్వీసెస్ అథారిటీ, సెక్రటరీ సీఎన్ మూర్తి 13. కృష్ణా జిల్లా విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ భూపాల్‌రెడ్డి 14. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ థర్డ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం మాధురి 15. చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పీవీఎస్ సత్యనారాయణ మూర్తి 16. నెల్లూరు జిల్లా గూడూరు సీనియర్ సివిల్ జడ్జీ కే సీతారామ కృష్ణారావు -
రేపు జాతీయ మెగా లోక్‌అదాలత్
నిజామాబాద్ లీగల్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముడియం వెంకట హరినాథ్ తెలిపారు. గురువారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా న్యాయపరమైన సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జాతీయ మెగా లోక్ అదాలత్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని సబ్‌కోర్టుల్లో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి సుజన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి లోక్‌అదాలత్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, పెట్టి కేసులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు పరిష్కరిస్తామన్నారు. జిల్లా కోర్టుతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి సబ్ కోర్టులలో న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
పిల్లలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు
సీనియర్ సివిల్ జడ్జి సీతారామకృష్ణారావు మార్కాపురం టౌన్ : వ్యాపార సంస్థలు, గృహాల్లో పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సీనియర్ సివిల్ జడ్జి కె.సీతారామకృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పదేళ్ల క్రితం బాల కార్మికులు ఎక్కువగా ఉండేవారని, ప్రస్తుతం కొంతమేర బాల కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. పిల్లలను తప్పక బడికి పంపించేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తేవాలని సూచించారు. చైల్డ్‌లై న్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.కిశోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 250 పట్టణాల్లో చైల్డ్‌లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 13 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించగా, అనధికారికంగా ఈ సంఖ్యకు ఎన్నోరెట్లు ఎక్కువగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బాలకార్మికులను అరికట్టడంలో అంగన్వాడీ సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు. తప్పిపోయిన, వీధి బాలలు, ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలలు, బాల్యవివాహాలకు బలవుతున్న బాలలు, అంగవైకల్యం, భిక్షాటన చేస్తున్న బాలలు, అనాథ బాలలను గుర్తించి 1098 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే చైల్డ్‌లైన్ ద్వారా వారికి రక్షణ కల్పించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వై.ధనలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది ఝాన్సీ, చైల్డ్ లైన్ బృంద సభ్యుడు సీతారామమూర్తి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
జిల్లా జైలులో సీనియర్ సివిల్‌జడ్జి విచారణ
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లాకోర్టు సీనియర్ సివిల్ జడ్జి బాందెఅలీ శనివారం సారంగాపూర్ జిల్లా జైలును సందర్శించారు. జైల్లో అండర్టయల్ ఖైదీలుగా ఉన్న 18-21 ఏళ్ల వయసున్న ఖైదీలను ఆయన విచారించారు. ఖైదీలతో మాట్లాడి కుటుంబ సభ్యుల వివరాలు, నేరచరిత్రను అడిగి తెలుసుకున్నారు. వారు చదువుకున్న పాఠశాలలో వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను తెప్పించి నిర్ధారణ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 18 ఏళ్ల వయసుకంటే తక్కువ ఉన్న ఖైదీలను గుర్తించి వారిని జైలు నుంచిజోనల్ జస్టిస్ అబ్జర్వేషన్ హోంకు పంపిస్తామని చెప్పారు. మహిళల బ్యారక్‌లో మహిళా ఖైదీలను ఆయన విచారించారు. వారి పిల్లలకు పౌష్టికాహారం అందుతుందో లేదో తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమతలేని ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదులను నియమిస్తామని, అర్హులను బెయిల్‌పై విడిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సి.శంకరయ్య, జైలర్ వీవీ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ జైలర్ మోహన్‌రెడ్డి, జైలు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.