ఎస్కేయూ, న్యూస్‌లైన్:ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద ఐకాస నేతలను కలిశారు. 2009, 2013లో రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఎస్కేయూనివర్సీటీలో ఉద్యమం జరిగిన తీరు, ఐకాస నేతల వ్యవహార శైలి వల్లే జై సమైక్యాంధ్ర పార్టీ అవిర్భవానికి స్ఫూర్తినిచ్చిందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎస్కేయూ ఐకాస కన్వీనర్ ఆచార్య సదాశివారెడ్డి కరువు జిల్లా అయిన అనంతపురమును దృష్టిలో వుంచుకొని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాడాలని కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన వారిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ఆచార్య ఎం.సీ.ఎస్.శ్రీనివాసన్, జై సమైక్యాంధ్ర పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరాజు, క్రాంతికిరణ్, వెంకటేసులు, భోదనేతర సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, ఓబుళరెడ్డి, హిమగిరి, శివఉన్నారు.