ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్స్ సంఘం (ఏపీజీఏ) కొత్త అధ్యక్షుడిగా వి.దశరథ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.సోమేశ్వర్‌లు ఎన్నికయ్యారు. జాతీయ మాజీ జిమ్నాస్ట్ సోమేశ్వర్ రాష్ట్రం తరఫున పలు మార్లు జాతీయ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక్కడి ఒలింపిక్ భవన్‌లో ఆదివారం హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు రవి ఈశ్వర్ చంద్ పర్యవేక్షణలో ఏపీజీఏ కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు భారత జిమ్నాస్టిక్ సమాఖ్య సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ సాహు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ధన్‌కిషన్ బండారి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) తరపున అలీమ్ ఖాన్‌లు పర్యవేక్షులుగా వ్యవహరించారు. కోశాధికారిగా ఆర్.రవీందర్, ఉపాధ్యక్షులుగా రవి ఈశ్వర్ చంద్, రణప్రతాప్ గౌడ్, ఎం.రాజేష్ కుమార్, డాక్టర్ గౌర్ఖీ, వి.వినేష్, సంయుక్త కార్యదర్శులుగా ఎల్.శాంతి, పి.రేణుక, ఎస్.శ్రీనివాస్‌రావులు ఎన్నికయ్యారు.
ఏపీజీఏ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్
Published Tue, Feb 18 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
Advertisement
Advertisement