
ముంబై: లక్షలమంది కస్టమర్లు సిబ్బందితో దేశంలో దిగ్గజ బ్యాంకుగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిజిటలైజేషన్, టెక్నాలజీ వినియోగంలోకూడా ముందు వరుసలో నిలపాలని బ్యాంక్ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రజనీష్ కుమార్ ఆకాంక్షించారు.
ఈమేరకు ఆయన బ్యాంక్ సిబ్బందికి లేఖ రాశారు. టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కస్టమర్లకు కొత్త బ్యాంకింగ్ సేవలను అందించేందుకు టెక్నాలజీలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలని అప్పుడే పోటీలో నిలువగలమని తెలిపారు. వినియోగదారులతో మర్యాదగా, స్నేహపూరితంగా మెలగాలని సూచించారు.