గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహరుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ.75లక్షలకు పైన తీసుకునే హోంలోన్లపై 10 బీపీఎస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ ఆదేశాలు జూన్15నుంచి అమల్లోకి వస్తాయని శుక్రవారం ప్రకటించింది.అంచనాలకు అనుగుణంగానే ఎస్‌బీఐ గృహరుణాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. అయితే పరిమితిరూ.75లక్షలకు పైన ఈ తగ్గింపును వర్తింపచేయడంతో నిరాశ వ్యక్తమవుతోంది
తాజా తగ్గింపు ప్రకారం ఇకపై రూ.75లక్షల పైన గృహరుణాలపై 8.55 శాతం వడ్డీరేట్లు వర్తించనుంది. మహిళలకు 8.60శాతం వడ్డీరేట్లును అమలు చేయనుంది.
ఇంటిని కొనుగోలు చేయడం పెద్ద విషచయనీ, ఈ వడ్డీ రేట్ తగ్గింపు ద్వారా గృహ కొనుగోలుదారులు తమ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఉపయోడపడుతుందని ఎస్‌బీఐ నేషనల్ బ్యాంకింగ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజనీష్ కుమార్ తెలిపారు. తమ కస్టమర్లకుసేవలో తమ బ్యాంకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. కాగా 2017 ఏప్రిల్ 9న హోంలోన్లపై (ఎంసీఎల్‌ఆర్)25 బేసిస్‌పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.