State Bank of India to change credit card charges from March 17 - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా.. బీఅలర్ట్‌!

Published Wed, Feb 15 2023 2:22 PM | Last Updated on Wed, Feb 15 2023 4:38 PM

State Bank of India Changes Credit Card Fees - Sakshi

ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లపై మరింత భారాన్ని మోపింది. క్రెడిట్‌ కార్డ్‌లకు సంబంధించిన ఫీజును సవరిస్తున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తాజాగా ప్రకటించింది. కొత్త ఫీజులు మార్చి 17 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపించింది.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా రెంట్‌ చెల్లింపులపై ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199లకు పెంచింది. ఇది ఇంతకు ముందు రూ.99 ఉండేది. రెంట్‌ చెల్లింపులపై గతేడాది నవంబర్‌లోనే రూ.99లు చేసిన ఎస్‌బీఐ తాజా మళ్లీ పెంచింది. దీనికి 18 శాతం జీఎస్‌టీ అదనం. సింప్లీ క్లిక్‌ కార్డ్‌లకు సంబంధించిన అనేక నిబంధనలను ఈ ఏడాది జనవరిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ సవరించింది. పలు పరిమితులు విధించింది. వోచర్లు, రివార్డ్‌ రిడెమ్షన్‌లకు సంబంధించి మార్పులు చేసింది.

జనవరి 6 తర్వాత వచ్చిన మార్పుల ప్రకారం సింప్లీ క్లిక్‌ కార్డ్‌ హోల్డర్లు గరిష్ట ఆన్‌లైన్‌ స్పెండింగ్‌కు చేరుకున్నాక ఇచ్చే క్లియర్‌ ట్రిప్‌ వోచర్లను ఒకే ట్రాన్సాక‌్షన్‌లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇతర ఆఫర్లతో కలిపి వినియోగించుకునేందుకు ఆస్కారం లేదు. ఇక అమెజాన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు సంబంధించిన రివార్డ్‌ పాయింట్ల వినియోగంలో కూడా నిబంధనలు జనవరి 1 నుంచి మారాయి.

(ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌: వడ్డీ బాదుడు షురూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement