న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి చిన్న స్థాయి పేమెంట్స్ బ్యాంకును ఏర్పాటు చేయటానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రంగంలో దిగ్గజ స్థాయి బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ... చిన్న పేమెంట్స్ బ్యాంకు కోసం రిలయన్స్‌తో కలిసి ఇప్పటికే దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో రిలయన్స్‌కు 70 శాతం వాటా, ఎస్‌బీఐకి 30 శాతం వాటా ఉంటాయి.
‘‘చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకోసం నియంత్రణ సంస్థల పరమైన విధివిధానాలను పూర్తిచేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా నిర్దిష్ట గడువేదీ విధించుకోలేదు’’ అని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అప్పట్లో చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుకు 11 సంస్థలు లైసెన్సులు పొందగా.. మూడు సంస్థలు లైసెన్సుల్ని తిరిగి ఇచ్చేశాయి. ఎయిర్‌టెల్, పేటీఎం సంస్థలు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించాయి కూడా. డిపాజిట్లు తీసుకోవటంతో పాటు, పేమెంట్ సర్వీసులకు మాత్రమే ఈ బ్యాంకులు పరిమితమవుతాయి. రుణాలివ్వడానికి ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment