ప్రస్తుతం ఏటీఎం కార్డులు వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వాటి అవసరం పడుతుంది. మనం ఒక నెల, రెండు నెల రోజులు ఏటీఎం కార్డు వాడకపోతే పిన్ మర్చిపోవడం సాదారణ విషయమే. రెగ్యులర్‌గా ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. పిన్ గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం సాధారణమే. అలాగే, రెండు లేదా మూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఒకవేల ఏటీఎం పిన మర్చిపోతే కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కొద్దిగా కష్టమయ్యేది.
కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిన్ జనరేట్ చేయడం చాలా సులువు. మీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు సులువుగా పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈజీ స్టెప్స్‌తో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయండిలా..?
- మీ ఖాతా క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లోనికి లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మెనులో ఉన్న 'ఈ-సర్వీసెస్> ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్' ఆప్షన్ ఎంచుకోండి.
- ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్ పేజీ క్లిక్ చేయగానే మరొక పేజీ క్రియేట్ చేయండి.
- ఇప్పుడు "వన్ టైమ్ వర్డ్' లేదా 'ప్రొఫైల్ పాస్ వర్డ్' అనే రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి.
- ఇప్పుడు 'ప్రొఫైల్ పాస్ వర్డ్' ఆప్షన్ ఎంచుకొని 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే, మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి.
- ఇప్పుడు మీరు పిన జనరేట్ చేయాలి అనుకున్న ఖాతా రేడియో బటన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఆ బ్యాంకు ఖాతాకు లింకు అయిన ఏటీఎం కార్డు ఎంచుకోండి.
- ఆ తర్వాత మీకు కనిపించే Enter First Two Digits of Your Desired Pin బాక్స్లో మీకు గుర్తుండే ఒక రెండు నంబర్స్ నమోదు చేయండి.
- ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీలో వచ్చిన రెండు నంబర్స్, మీరు ఎంటర్ చేసిన రెండు నంబర్స్ కలిపి ఇప్పుడు మీకు కనిపించే బాక్స్లో నమోదు చేయండి.
- ఈ నాలుగు నంబర్స్ మీ ఏటీఎం పిన్ గా మారుతుంది.
(చదవండి: పాలసీల ప్రీమియం ధరలు పెరగనున్నాయా?)
Comments
Please login to add a commentAdd a comment