atm pin number
-
Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి
ఆధునిక ప్రపంచంలో ఆన్లైన్ పోర్టల్ వినియోగంలోకి వచ్చిన తరువాత మనం చేయాల్సిన పనులు దాదాపు ఇంటి నుంచి చేసేయడానికి వీలుపడుతోంది. ఇందులో భాగంగానే 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాదారులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్లకుండానే ఏటీఎమ్ పిన్ మార్చుకోవచ్చు. దీని కోసం ఈ కింది దశలను పాటిస్తే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఓపెన్ చేయండి పర్సనల్ బ్యాంకింగ్ డీటైల్స్‌లో లాగిన్ అవ్వండి ఇ-సర్వీసుకి వెళ్లి ఏటీఎమ్ కార్డ్ సర్వీసు కోసం క్రిందికి స్క్రోల్ చేయండి. డ్రాప్-డౌన్ లిస్ట్ నుంచి కొత్త ఏటీఎమ్ పిన్ జనరేట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. కొనసాగడానికి 'Get Authorization PIN' ఆప్షన్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పొందుతారు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. రీసెట్ చేయాలనుకుంటున్న ఏటీఎమ్ పిన్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి. పిన్ రీసెట్ చేయడానికి కార్డు వివరాలు ఎంచుకోండి. కార్డు వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీకు నచ్చిన, బాగా గుర్తుంచుకోగలిన రెండు అంకెలను ఎంటర్ చేయండి. తరువాత మిగిలిన రెండు అంకెలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తాయి. పిన్ నాలుగు అంకెలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం ముగిసే సమాయానికి ఎస్బిఐ మీకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ పంపిస్తుంది. ఎస్బిఐ ఏటీఎమ్ పిన్ నెంబర్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ కూడా ఇంటినుంచి అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
ఎస్బీఐ ఏటీఎం పిన్ మర్చిపోయారా? 2 నిమిషాల్లో PIN జనరేట్ చేయండిలా..!
ప్రస్తుతం ఏటీఎం కార్డులు వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వాటి అవసరం పడుతుంది. మనం ఒక నెల, రెండు నెల రోజులు ఏటీఎం కార్డు వాడకపోతే పిన్ మర్చిపోవడం సాదారణ విషయమే. రెగ్యులర్‌గా ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. పిన్ గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం సాధారణమే. అలాగే, రెండు లేదా మూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఒకవేల ఏటీఎం పిన మర్చిపోతే కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కొద్దిగా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిన్ జనరేట్ చేయడం చాలా సులువు. మీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు సులువుగా పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈజీ స్టెప్స్‌తో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయండిలా..? మీ ఖాతా క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఎస్బీఐ ఆన్లైన్లోనికి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మెనులో ఉన్న 'ఈ-సర్వీసెస్> ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్' ఆప్షన్ ఎంచుకోండి. ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్ పేజీ క్లిక్ చేయగానే మరొక పేజీ క్రియేట్ చేయండి. ఇప్పుడు "వన్ టైమ్ వర్డ్' లేదా 'ప్రొఫైల్ పాస్ వర్డ్' అనే రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి. ఇప్పుడు 'ప్రొఫైల్ పాస్ వర్డ్' ఆప్షన్ ఎంచుకొని 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే, మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు పిన జనరేట్ చేయాలి అనుకున్న ఖాతా రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బ్యాంకు ఖాతాకు లింకు అయిన ఏటీఎం కార్డు ఎంచుకోండి. ఆ తర్వాత మీకు కనిపించే Enter First Two Digits of Your Desired Pin బాక్స్‌లో మీకు గుర్తుండే ఒక రెండు నంబర్స్ నమోదు చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వచ్చిన రెండు నంబర్స్, మీరు ఎంటర్ చేసిన రెండు నంబర్స్ కలిపి ఇప్పుడు మీకు కనిపించే బాక్స్‌లో నమోదు చేయండి. ఈ నాలుగు నంబర్స్ మీ ఏటీఎం పిన్ గా మారుతుంది. (చదవండి: పాలసీల ప్రీమియం ధరలు పెరగనున్నాయా?) -
పిన్ నంబర్ కోసం వచ్చి బుక్కయ్యారు
లక్నో: ఓ వ్యక్తి దగ్గర నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన ఇద్దరు దొంగలు ఏటీఎం పిన్ నంబర్ కోసం వచ్చి పోలీసుల చేతికి చిక్కారు. ఈ సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాత్రి ఓ వ్యక్తి డిన్నర్ చేయడం కోసం బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి.. సదరు వ్యక్తిని గన్‌తో బెదిరించారు. అతడి వద్ద నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. దానిలో బాధితుడి ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డు ఉన్నాయి. కొద్ది దూరం వెళ్లిన నిందితులు వెనక్కి వచ్చి.. ఏటీఎం పిన్ నంబర్ చెప్పాల్సిందిగా బాధితుడిని బెదిరించారు. అది తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ విషయం గురించి బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు నిందితుల బైక్‌ను అడ్డుకున్నారు. దాంతో పోలీసుల మీద కాల్పులకు తెగ బడ్డారు. (లారీ చోరీ చేసి..కరోనా పరీక్షకు) దీని గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చెక్ చేయాలి.. బైక్‌ను ఆపాల్సిందిగా నిందితులకు చెప్పాం. కానీ వారు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో అధికారులు కూడా కాల్పులు జరపడంతో వారికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు. నిందితులిద్దరిని గౌరవ్ సింగ్, సదానంద్‌గా గుర్తించారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.3200 నగదు, ఏటీఎం కార్డ్, పర్స్‌తో పాటు రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. -
త్వరలో నీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది..
చీరాల రూరల్: సైబర్ నేరగాళ్ల దెబ్బకు బ్యాంకు అకౌంట్లోని డబ్బులు కూడా క్షణాల్లో మాయమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇటువంటి సంఘటన చీరాలలో ఒకటి వెలుగు చూసింది. త్వరలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఆధార్ నంబర్, పాన్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడంతో కంగారు పడిన బాధితుడు వారు అడిగిన పూర్తి సమాచారం టకటకా అందించాడు. ఇంకేముంది క్షణాల్లో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రెండు దఫాలుగా రూ.95 వేలు మాయం చేశారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. టూటౌన్ సీఐ రామారావు కథనం ప్రకారం.. పేరాల భావనారుషి పేటలో నివాసం ఉండే మార్పు బాలమోషేకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను హైదరాబాద్ యాక్సిస్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. త్వరలో నీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన ఏటీఎం పిన్ నంబర్‌తో పాటు పాన్‌కార్డు, ఆధార్ నంబర్ చెప్పాలని కోరాడు. ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అపరిచిత వ్యక్తి అడిగిన సమాచారాన్నంతా బాల మోషే చెప్పేశాడు. వివరాలు చెప్పిన కొద్దిసేపటికి మోషే సెల్‌ఫోన్‌కు ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.45 వేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆందోళన చెంది బ్యాంకు మేనేజర్‌ను కలిసి జరిగిన విషయం వివరించాడు. మేనేజర్ సలహా మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మీ ఏటీఎం పిన్ మార్చట్లేదా..
చందనకు ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘చందన గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ అవతలి వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టసాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు చందన కార్డు నుంచి లాగేసాడు. గుంటూరు, తుళ్లూరు: ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేసింది. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానులు వ్యక్తిగత రహస్యాలను చిక్కబట్టుకుని బెదిరింపులకు పాల్పడుతన్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మాటలతో మభ్య పెడుతూ.. ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాల పేరుతో రకరకాలుగా ఫోన్ కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. నెట్లో వ్యక్తిగత జీవితం.. కత్తికి రెండు వైపులా పదునున్నట్టు స్మార్ట్‌ఫోన్.. మంచీ చెడూ రెండింటికీ ఉపయోగపడుతుంది. ఉపయోంగిచుకునే విధానం ప్రధానం. సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితానికి ఏమారుపాటుగా ఉన్నా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్లో పెట్టేస్తున్నారు. ఇలా చేసే వారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు. ప్రొఫైల్స్‌తో జాగ్రత్త.. బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు వెతుక్కునే వారి సౌకర్యార్థం అనేక వెబ్సైట్లు ప్రొఫైల్స్ పేరుతో సదుపాయాలు అందిస్తున్నాయి. ఎవరైనా అమ్మాయి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు దొరికితే సైబర్ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌ను పెట్టేస్తున్నారు. దీంతో సదరు యువతికి వేధింపులు తప్పడం లేదు. స్మిషింగ్ వైరస్ స్మార్ట్ ఫోన్ల ప్లాట్‌ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ..అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దను కుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏదీ నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. ప్రసుతం సైబర్ నేరగాళ్లు వాడుతున్న అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఇది. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. అటువంటి పరిస్థితుల్లో వాటికి రిప్లై ఇవ్వడం గానీ లింక్ ఓపెన్ చేయడం గానీ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పోచ్‌లో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోండి సుమా. ఏటీఎం క్లోనింగ్ ఈ మధ్య కాలంలో ఏటీఎం కార్డులు విచ్చలవిడిగా క్లోనింగ్‌కు గురవుతున్నాయి. ఏటీఎం మాదిరిగానే మరో ఏటీఎం కార్డును హ్యాకర్లు తయారు చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇదెలాగంటే.. మొదట నేరగాళ్లు వారు ఎంచుకున్న వ్యక్తి కదలికపై/ఏటీఎం సెంటర్‌పై నిఘా ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎంలో డబ్బు డ్రా చేసే సమయాన్ని గమనిస్తారు. స్కిమ్మర్ అనే పల్చని పొర ఉన్న పేపర్‌ను ముందుగానే ఏటీఎం మెషీన్లో ఉంచుతారు. ఆ వ్యక్తి ఏటీఎం ఉపయోగించి డబ్బు డ్రా చేసినపుడు కార్డు వివరాలు, ముద్రలు ఆ పొరమీద అచ్చుగుద్దినట్టు కనపడతాయి. స్కిమ్మర్‌తో పాటు అక్కడ రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరా ఆ వ్యక్తిని వాడిన పిన్ను రికార్డు చేస్తుంది. స్కిమ్మర్‌లో నమోదైన వివరాలతో మరో ఏటీఎం కార్డును తయారు చేసి దానికి ఉన్న ప్రత్యేకమైన, రహస్య అంకెలను బ్రూట్ఫోర్సు విధానంతో తెలుసుకుంటారు. యథేచ్ఛగా నగదు డ్రా చేస్తారు. బ్యాంకు అకౌంట్ నుంచి మనకు తెలియకుండా నగదు డ్రా అయితే బ్యాంకు అధికారికి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే సరి.. n క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. n ప్రతి కార్డుకు వెనుక భాగంలోమూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి. n మీ కార్డులపై స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉండాలి. n క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి. n ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించే టట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. n కార్డులను పోగొట్టుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి. n మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినపుడు ఈ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి. n ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లలో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు అడిగితే గుడ్డిగా రాయకూడదు. ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన అవసరం సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని కూడా దొంగలు వదలడం లేదు. ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి సెల్‌కు ఓటీపీ నంబర్ వస్తుందని, దాని చెప్పాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదు. అలా చెబితే బ్యాంకులోని నగదు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. డేటా సెక్యూర్, ఆన్లైన్ లావాదేవీలపై ప్రజలు అవగాహనతో ఉండాలి. నేరగాళ్లు ఫేక్ అకౌంట్స్‌తో వివిధ కోణాల్లో మోసాలకు పాల్పడుతుంటారు. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి.–సీహెచ్.వెంకటప్పలనాయుడు,గుంటూరు రూరల్ ఎస్పీ -
మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పమంటారా..?
హలో.. గుడ్‌మార్నింగ్... మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పమంటారా..? 1111 కదా.. ఏంటి షాక్‌కు గురయ్యారా..? ఓకే.. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పనా..? 1234.. అవాక్కయ్యారా..? మీ వివరాలు మాకెలా తెలిసాయని ఆలోచిస్తున్నారా.? కంగారు పడకండి. మిమ్మల్ని మేం ఫాలో అవ్వడం లేదు. కానీ.. ఎలా తెలుసుకున్నామనే కదా.. మీ డౌట్.? ఏం లేదండీ.. మీరే కాదు.. ప్రతి పది మందిలో ఐదుగురు ఇవే పాస్వర్డ్లు వినియోగిస్తున్నారు. మీ విషయంలో ఓ రాయి వేశాం. అంతే...!!! హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకోకండి. ఇప్పుడు కాస్తా ఊరటగా అనిపించినా.. మీ వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం వాటిల్లుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఓ హెచ్చరిక ఇస్తున్నాం. ఇక మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే.. నగరంలో.. దాదాపు అందరూ ఇదే తరహా తప్పులు చేస్తున్నారు. నిద్రలో లేచి అడిగినా గుర్తుంటుందనీ, వేరే నంబర్ పెడితే మర్చిపోతామని.. చాలా మంది ఒకే తరహా పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వినియోగిస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. 1234 అధికంగా.. చాలా మంది పుట్టిన రోజు తేదీని, జాబ్‌లో జాయిన్ అయిన తేదీని రహస్య కోడ్‌గా వినియోగిస్తున్నారు. ఇలా చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ కొలీగ్స్, సహచరులకు మీరు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పం డని హెచ్చరిస్తోంది.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్‌వర్డ్‌లకు పరిమితమైపోతున్నారని తేలిం ది. ఈ నివేదిక ప్రకారం.. నగరంలో ఎక్కువ మంది వాడుతున్న పిన్ నంబర్, పాస్వర్డ్ 1234. ఆ తర్వాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంతో కష్టమైంది పెడుతున్న చాలా మంది.. డబ్బులకు సంబంధించిన లావాదేవీలు జరిపే డెబిట్, క్రెడిట్ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచి ఉన్న స్మార్ట్ఫోన్లకు మాత్రం సులువైన పిన్ నంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. సైబర్ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. చాలా మంది తమ పుట్టిన రోజు తేదీని, సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు పాస్వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నంబర్లు 10 వేల వరకూ ఉన్నాయి. కానీ.. వందలో సగం మంది 10వేల నాలుగంకెల సంఖ్యల్లో కేవలం 500 నంబర్లు మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. ఇలా వాడటం వల్ల ఏటీఎం కార్డు పోయినా, చోరీకి గురైనా.. సులువుగా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు కలుగుతోంది. నగర వాసులు ఎక్కువగా వినియోగిస్తున్న పాస్వర్డ్లు, పిన్ నంబర్లు ఇవేనని సంస్థ చెబుతోంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010 తస్మాత్ జాగ్రత్త పిన్ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే.. నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్ విషయంలోనే కాదు.. మిగిలిన విషయాల్లోనూ జాగరూకతతో వ్యవహరించాలి. తద్వారా మీ డబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్‌డ్రా అయితే.. అందుకు బ్యాంకు బాధ్యత వహించదన్న విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడ్డా పోయిన డబ్బు రాదు. ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. అదే విదంగా పిన్ నంబర్ ఎంటర్ చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించినట్లైతే.. మీ లావాదేవీలను వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో చేతిని అడ్డం పెట్టుకోవడం, లేకపోతే.. ఇతరులకు కనబడకుండా జాగ్రత్తపడితే మంచిది. వేరే వ్యక్తులు మీకు సహాయం చేస్తామని వచ్చినప్పుడు తిరస్కరించండి. వారు బలవంతం పెడితే.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందివ్వండి. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతామేమోననే ఉద్దేశంతో పౌచ్‌లో పిన్ నంబర్ కూడా రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు.. కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోండి సుమా. అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ య్యాయి. అపరి చితులతో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి సెల్‌కు ఓటీపీ నెంబర్ వస్తుందని, దాన్ని చెప్పాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదు. అలా చెబితే బ్యాంకు ఖాతాలోని మొత్తం డబ్బు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏటీఎం కేంద్రాల్లో డబ్బు అపరిచిత వ్యక్తులకు కార్డులు ఇవ్వొద్దు. తెలిసిన వారైతేనే డబ్బు డ్రా చేసుకునేందుకు సహాయం తీసుకోండి. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకుంటాం. సైబర్ నేరాగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. – ఎం.చిదానందరెడ్డి, మదనపల్లె డీఎస్పీ -
తెరవెనుక దొంగలు
నేడు శాస్త్ర సాంకేతిక రంగం పరుగులు పెడుతోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దీన్ని కొందరు నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలకు దిగుతున్నారు. అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో అధికమవుతున్నాయి. ఇప్పటికే 35 మందికి పైగా ఆన్లైన్ మోసాల బారిన పడ్డారు. పోలీసు స్టేషన్లకు చేరుకుని లబోదిబోమంటున్నారు. తిరుపతి క్రైం: నైజీరియన్లతోపాటు మరికొందరు విదేశీయులు వీసాపై ఢిల్లీ, ముంబయి, కోల్కత్తా వంటి మెట్రో నగరాలకు చేరుకుంటున్నారు. అక్కడ లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని స్థానికంగా ఉన్న కొందరితో ఆపరేషన్ చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా తెప్పించుకున్న ఈమెయిల్ అడ్రస్‌లతోపాటు, మొబైల్‌కు మెసేజ్ పంపుతున్నారు. ఇందులో లాటరీ వచ్చిందని ఆశలు రేపుతున్నారు. దీంతో స్పందించిన అమాయకులు తమ బ్యాంకు ఖాతా నెంబర్, ఏటీఎం, పిన్, ఓటీపీ నెంబర్ చెబుతున్నారు. దుండగులు ఆయా నగరాల నుంచే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ నేరగాళ్లు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్లు వేశాం. ప్రజలకు అవగాహన కలిగేలా సైబర్ క్రైంపై ప్రచారం చేస్తున్నాం. తప్పుడు ప్రకటనలు, నిరుద్యోగులు, మాయలేడీల వలలో పడకండి. లాటరీ వచ్చిందని డబ్బులు కడితే ఇంటికి వస్తాయని నమ్మి మోసపోకండి. – క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆన్లైన్లో మోసాలు ఇలా ♦ ఓ యువకుడికి అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పలానా కంపెనీ నుంచి నగదును తమ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నామని అవతలి వ్యక్తి తెలిపాడు. నీకు పంపిన పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. ఆ యువకుడు పాస్వర్డ్ చెప్పిన వెంటనే తన అకౌంట్లో ఉన్న రూ.26 వేలు అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ♦ తిరుపతికి చెందిన ఒక యువకుడికి పేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి తనకు నగదు ఇవ్వాలని, మళ్లీ ఇస్తానని చెప్పి రూ.వేలు కాజేసింది. తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితుడు క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ♦ క్విక్కర్, ఓఎల్ఎక్స్ సంస్థలను సైతం సైబర్ నేరగాళ్లు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వస్తువులను పెట్టి తక్కువ ధరలకే విక్రయిస్తామని చెబుతున్నారు. అలా ఆశపడ్డ వ్యక్తి అకౌంట్లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు. ♦ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఒకసారి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని తెలిపి అకౌంట్ నెంబర్ తెలుసుకుని పాస్వర్డ్ పంపుతారు. పాస్వర్డ్ పంపితే ఆధార్ కార్డు అనుసంధానం అవుతుందని నమ్మబలుకుతారు. అలా చెప్పిన వెంటనే అకౌంట్లోని డబ్బులను వారి అకౌంట్‌కు బదిలీ చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు సైతం నగరంలో అధికంగానే నమోదవుతున్నాయి. -
ఆన్లైన్లో ఘరానా మోసం
భట్టిప్రోలు: బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని ఓ అజ్ఞాత వ్యక్తి ఓ మహిళకు ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు గడువు ముగిసిందని, రెన్యువల్ చేయాలంటే కార్డు నంబర్ చెప్పాలని నమ్మించాడు. ఆపై అకౌంట్లో ఉన్న రూ.50 వేలు మాయం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భట్టిప్రోలు ఎస్ఐ ఇ.బాలనాగిరెడ్డి కథనం ప్రకారం.. స్థానిక కేఎస్కే కళాశాల సమీపంలో నివసిస్తున్న షేక్ ఆసియాకు మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఏటీఎం గడువు ముగిసిందని, రెన్యువల్ చేయాలంటే కార్డు నంబర్ చెప్పాలని తెలిపాడు. నిజంగానే గడువు ముగిసిందని నమ్మిన ఆ మహిళ కార్డు నంబర్‌తో పాటుగా, పిన్ నంబర్ కూడా చెప్పింది. ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్‌కు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు వచ్చాయా లేదా అని ఆ వ్యక్తి ఫోన్ చేసి మరలా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇదే అదనుగా భావించి ఆమె ఖాతాలోని రూ.50 వేలను నాలుగు దఫాలుగా ఆన్లైన్లో డ్రా చేశాడు. నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావటంతో ఆమె అవాక్కయ్యింది. మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ మేనేజర్‌నంటూ ఘరానా మోసం
మంగపేట : తాను బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకొని అకౌంట్లో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన జాడి రవి సెల్‌ఫోన్‌కు మంగళవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో 8298328147 నంబర్ నుంచి 9 సార్లు ఫోన్ వచ్చింది. చివరిసారి ఫోన్ లిఫ్ట్ చేయగా తాను బ్యాంక్ మేనేజర్‌నని, మీ బ్రాంచ్ ఏటీఎం, ఆధార్, పాన్‌కార్డు నంబర్లు ఇవ్వమని అడిగాడు. ఎందుకని రవి ప్రశ్నిం చగా మీ పిన్ మార్చుతున్నామని చెప్పడంతో తన పిన్ నంబర్ చెప్పాడు. పిన్ నంబర్ చెప్పిన వెంటనే తన బ్యాంక్ ఆకౌంట్, తన పూర్తి వివరాలను వెల్లడించాడు. ఫోన్ కట్ కాగానే తన ఏటీఎం ద్వారా రూ.10 వేలు డ్రా చేసినట్లు రవి ఫోన్‌కు మెసేజ్ వచ్చిది. వెంటనే అతడు మంగపేటకు వచ్చి అసలు ఏమి జరిగిందని తెలుసుకునేసరికి ఎవరో అపరిచిత వ్యక్తి ఏటీఎం పిన్‌నంబర్ తెలుసుకుని మీ అకౌంట్లో ఉన్న రూ.10 వేల నగదును డ్రా చేశారని సిబ్బంది వివరించారు. జరిగిన విషయంపై విచారణ జరిపి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఉదయం పిర్యాదు చేసినట్లు బాధితుడు వివరించాడు. -
ఫోన్ కాల్ : రూ. 5.1 లక్షలు హాంఫట్
కాకినాడ: ఫోన్ కాల్‌తో రూ. 5.1 లక్షలు హాంఫట్ చేసిన వైనమిది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఏటీఏం వివరాలు తెలుసుకుని కొద్ది గంటల వ్యవధిలోనే మొత్తం సొమ్ములు డ్రా చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మారేడుబాక ఫైర్‌స్టేషన్ సమీపంలో నివసిస్తున్న శీలం వీరబాబు అనపర్తిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ. 5.1 లక్షలు డిపాజిట్ చేశాడు. గత నెల 26 ఉదయం వీరబాబుకు ఫోన్‌కాల్ వచ్చింది. బ్యాంకు నుంచి ఫోన్ చేసున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాకు అయ్యింది. ఫిన్ నంబరు, కార్డు వెనుక వైపున ఉన్న నంబరు, మీ వివరాలు చెప్పాలంటూ అడిగిన ప్రశ్నలన్నింటి కీ వీరబాబు సమాధానమిచ్చాడు. కొద్ది వ్యవధిలోనే వీరబాబు సెల్‌కు పాస్ వర్డ్‌లతో కూడిన నంబర్లు రావడం, ఏటీఎం కార్డు వినియోగంలోకి తీసుకు వస్తున్నాం మెసేజ్లోని పాస్ వర్డ్ చెప్పమంటూ ఆజ్ఞాత వ్యక్తి కోరాడు. ఈ విధంగా దాదాపు 13 సార్లు వీరబాబుకు వచ్చిన పాస్వర్డ్ వివరాలను అజ్ఞాత వ్యక్తి తెలుసుకున్నాడు. రాత్రికి చార్జింగ్ లేక సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జింగ్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం ఆన్ చేసుకుని చూసేసరికి అకౌంట్లో నగదు డ్రా చేసినట్టు మెసేజ్‌లు ఉన్నాయి. ఆందోళనకు గురైన వీరబాబు అనపర్తి వెళ్లి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆన్లైన్లో అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు డ్రా చేసుకున్నారు కదా అంటూ ఎదురు ప్రశ్నించడంతో తాను మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకు మేనేజర్‌నంటూ మోసం
కమ్మర్పల్లి : బ్యాంకు మేనేజర్‌నని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకున్నాడు. క్లోనింగ్ చేసిన కార్డుతో వివిధ దుకాణాల్లో షాపింగ్ చేసి రూ. 15,630 డ్రా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ పవార్ బాలాజీకి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఫోన్‌కు ఆదివారం రాత్రి 70338 71737 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. నీ ఏటీఎం పిన్ నంబర్ మారిందని తెలిపాడు. పాత నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో బాలాజీ తన కార్డు నంబర్ తెలిపాడు. అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ పెట్టేశాడు. అనుమానం వచ్చిన బాలాజీ.. వెంటనే కమ్మర్‌పల్లిలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే ఏటీఎం బంద్ ఉండడంతో మెట్పల్లి ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చూశాడు. అనేబుల్ టు ప్రాసెస్ అని రిసిప్ట్ రావడంతో నివ్వెరపోయాడు. సోమవారం కమ్మర్పల్లి ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాకు సంబంధించి లావాదేవీలు చూడగా ఆదివారం ఒక్కరోజే ఏడు దఫాలుగా రూ. 15,630 డ్రా అయినట్లు తేలింది. కార్డు తన వద్ద ఉండగానే ఖాతాలోని నగదు ఎలా విత్‌డ్రా అయ్యిందని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. పిన్ నంబరు చెప్పడం వల్ల అజ్ఞాత వ్యక్తి షాపింగ్ ద్వారా డబ్బులు డ్రా చేసి ఉంటాడని మేనేజర్ పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు. -
పిన్‌తో జాగ్రత్త
డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అక్కడ కూడా పిన్ను వినియోగించే పద్ధతి ఈనెల ఒకటి నుంచీ అమల్లోకి వచ్చింది. కార్డును స్వైప్ చేసి బిల్లు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ (పిన్) కూడా ఎంటర్ చేస్తేనే లావాదేవీ పూర్తి అవుతుంది. డెబిట్ కార్డుతో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ ఈ మేరకు నిబంధనలు మార్చింది. కాని ఇలా పిన్ ఎంటర్ చేసేటప్పుడు కనీస జాగ్రత్త పాటించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే షాపింగ్‌లో డెబిట్ కార్డును వినియోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ఏటీఎం పాస్వర్డ్ అనేది అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. ఈ పిన్ అందరికీ తెలిస్తే దీంతో ఎటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చన్న సంగతి మర్చిపోవద్దు. అంతే కాదు వారు కూడా బయట షాపింగ్‌కు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే ఈ పిన్ను మూడో వ్యక్తికి తెలవకుండా జాగ్రత్తపడండి. కౌంటర్ వద్ద పీవోఎస్ మెషీన్లో పిన్ను ఎంటర్ చేయాల్సినప్పుడు ఆ నంబర్‌ను బిల్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి చెప్పకుండా నేరుగా మీరే ఎంటర్ చేయండి. అలాగే ఎంటర్ చేసేటప్పుడు మిగిలిన వారికి కనపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. -విశాల్ సాల్వి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్