సెలవు రోజు ఆదివారం కూడా జిల్లాలో ఎక్కడో ఒకట్రెండు ప్రాంతాలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద్వారా ఉద్యోగులు, ఖాతాదారులకు సేవలందిస్తున్నట్లు ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎంవీఆర్ మురళీక్రిష్ణ తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : సెలవు రోజు ఆదివారం కూడా జిల్లాలో ఎక్కడో ఒకట్రెండు ప్రాంతాలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద్వారా ఉద్యోగులు, ఖాతాదారులకు సేవలందిస్తున్నట్లు ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎంవీఆర్ మురళీక్రిష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ‘మేళా ఆన్ వీల్స్’ పేరుతో మొబైల్ వ్యాన్ ద్వారా సేవలందించారు. సొసైటీ కనెక్ట్ పేరుతో ప్రతి ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నందున ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రధానంగా వాహన, గృహ కొనుగోలుకు సంబంధించి రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ హరిబాబు, డిప్యూటీ మేనేజర్ ఎస్‌వీ ప్రసాద్, బ్రాంచి మేనేజర్ నాగేంద్ర, ఇతర అధికారులు శ్యామ్, చౌదరి పాల్గొన్నారు.