హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను హెచ్చరించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్‌బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు.
అయితే, ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్త ఉండాలని సూచిస్తుంది. మోసగాళ్లు ఈ నకిలీ లింక్స్ సహాయంతో వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్‌బీఐ పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు క్రింద పేర్కొన్న విధంగా వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి రూ.10 వేల నగదు పొగట్టుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే, ఇలాంటి నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మోసాల బారిన పడకుండా ఎస్‌బీఐ సూచనలు:
* ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆలోచించండి.
* కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
* మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.
* నకిలీ లింక్స్ ఎప్పుడు క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి. వాటి యుఆర్ఎల్ లో బ్యాంక్ పేరు లేకుండా వస్తాయి.
రిపోర్ట్ చేయడం ఎలా?
ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాలో అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు నివేదించాలి. ఇలాంటి లావాదేవీలను గుర్తించిన వెంటనే 1800 425 3800, 1800 112 211 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. వారు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ దృష్టికి తీసుకెళ్తారు.
(చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!)
Comments
Please login to add a commentAdd a comment