జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి ప్రయత్నించారు. బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులు చివరికి విఫలమయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకులో చోరీకి యత్నించినట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా బ్యాంకులో ఎటువంటి నగదు మాయం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.