నిర్మాణం చేపడుతున్న వంతెన
ముత్తారం(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ2 విస్తరణకు చేపట్టిన భూసేకరణలో నష్టపరిహారం చెల్లించకుండానే ఎస్సారెస్పీ ఎల్6 కాలువ మళ్లింపు పనుల్లో భాగంగా తమ భూముల్లో దౌర్జన్యంగా అధికారులు వంతెన నిర్మాణం చేపడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం లద్నాపూర్ పంచాయతీ పరిధి రాజాపూర్‌లో బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామశివారులోని 193, 200లో ప్రభుత్వం సుమారు 60 ఏళ్ల క్రితం భూపంపిణీలో భాగంగా గ్రామంలోని నిరుపేదలకు 25.18 ఎకరాల భూమిని పంపిణీచేసి పట్టాలు జారీచేసిందన్నారు. తమకు పంపిణీ చేసిన భూములకు నష్టపరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఫిర్యాదుచేస్తే నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment