ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్‌బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది.
పిఎంఎఫ్‌బివై ప్రయోజనాలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్)
కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్‌లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్‌కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment