
ఇటీవల రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్‌హీరో సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాదించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది. రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్.
Comments
Please login to add a commentAdd a comment