chinnababu
-
రైతులకు స్టార్ హీరో భారీ సాయం
ఇటీవల రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్హీరో సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాదించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది. రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్. -
కార్తీ ‘చినబాబు’ టీజర్ విడుదల
-
చింతూరు ఐటీడీఏ తొలి పీఓగా చినబాబు
చింతూరు: స్థానిక ఐటీడీఏ తొలి ప్రాజెక్టు అధికారి (పీఓ)గా గుగ్గిలి చినబాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల ప్రజల సౌకర్యార్థం ఈ ఏడాది ఏప్రిల్లో చింతూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి రంపచోడవరం పీఓ కేవీఎ¯ŒS చక్రధరబాబు ఇ¯ŒSఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చినబాబు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ జనరల్గా, చింతూరు మండల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. చినబాబు మాట్లాడుతూ విలీన మండలాల ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.