
విజయవాడ, అజిత్‌సింగ్‌నగర్: నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నల గుండెలు మండాయి. ఆందోళన బాట పట్టారు. సీఎంను కలిసేందుకు ‘చలో అసెంబ్లీ’కి పయనమయ్యారు. న్యాయం కోసం నినదించిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ప్రతాపం చూపించింది. పోలీసు బలాన్ని ప్రయోగించింది. మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించింది. మనస్తాపానికి గురైన అన్నదాతలు పోలీస్‌స్టేషన్‌లోనే ఆందోళన చేపట్టారు. ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.
నున్న పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత: న్యాయం కోసం వచ్చిన తమను అరెస్టు చేయడంపై రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ కర్కశత్వాన్ని జీర్ణించుకోలేక ముగ్గురు కౌలు రైతులు బి.పూర్ణచంద్రరావు, వి.తిరపతయ్య, జి.రామయ్య నున్న పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకొని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment