sucide attemt
-
భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్ వాట్సాప్ చేసి..
సాక్షి, యశవంతపుర: ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు చెప్పాడు, తరువాత బీమా పత్రాలను, డెత్‌నోట్‌ను వాట్సప్ చేసి నడుస్తున్న రైలు కిందకు దూకి కేంద్ర ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇన్స్పెక్టర్ ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర దూబె 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఐటీ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన యశవంతపురలోని బీడీఏ ఆఫీసు వద్ద నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. సుమారు 10 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. దూబె చివరిసారిగా యూపీలో ఉంటున్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తరువాత బెంగళూరులో భార్య ఆరతి మాళవికి కాల్ చేసి మాట్లాడి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. కొంతసేపటికి తన ఇన్సూరెన్స్ పత్రాల కాపీలను, సూసైడ్ నోట్‌ను భార్యకు వాట్సాప్ చేశాడు. నా మరణానికి నాదే బాధ్యత అని డెత్‌నోటులో రాశాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించగా రైలు పట్టాల వద్ద మృతదేహం కనిపించింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు) -
నా కూతురి పెళ్లిని కోటి రూపాయలతో నిర్వహించండి అంటూ..ఓ తండ్రి..
మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపింది. అతను చనిపోవడానికి ముందు ఓ వీడియో తీసుకున్నాడు. అందులో నా కూతురు పెళ్లిని దాదాపు ఒక కోటి రూపాయాలు ఖర్చుపెట్టి నిర్వహించండి అని చెప్పడం అందర్నీ కంటతడిపెట్టించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సంజయ్ సేథ్ అనే ప్రముఖ వ్యాపారి తన భార్య మీనుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని కిషోర్‌గంజ్ అనే ప్రాంతంలో నివస్తున్నాడు. ఏమోందో ఏమో! తన భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సంజయ్ సేథ్. ఈ ఘటన జరిగినప్పుడూ ఆ గదిలో వారిద్దరే ఉన్నారు. ఆ కాల్పుల శబ్దం విని కుటుంబసభ్యులు వచ్చి చూడగా..అతడి భార్య మృతి చెందగా, సంజయ్ కొన ఊపిరితో కొట్టుకుంటూ కనిపించాడు. ఐతే అతను కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సంజయ్ ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అందులో సంజయ్ ఏడుస్తూ తాను కొందరికి అప్పు ఇచ్చాను వారు తిరిగి చెల్లించలేదని చెప్పాడు. దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. ఆమె పెళ్లిని సుమారు రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి జరిపించండి. నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. అలాగే లాకర్లో సుమారు రూ. 29 లక్షలు ఉందని, తన కూతురికి చాలా నగలు ఉన్నాయని చెప్పాడు. పిల్లలు నన్ను క్షమించండి. నా భార్య, నేను బతకలేక వెళ్లిపోతున్నాం అని కన్నీటిపర్యంతమయ్యాడు. చివర్లో తాను బాగేశ్వర్ ధామ్ భక్తుడునని, గురూజీ నన్ను క్షమించండి మరో జన్మ లభిస్తే కచ్చితంగా మీకు మంచి భక్తుడిగా ఉంటానని వాపోయాడు. అలాగే సంఘటనా స్థలం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..ఈ ఘటన చాలా బాధకరం. ఇది గృహ వివాదానికి సంబంధించినదిగా గుర్తించాం. ఈ సంఘటనలో బయట వ్యక్తి ప్రమేయం లేదని ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరే ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..) -
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని..అవమానంతో యువకుడు మృతి
ఒక వ్యక్తి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అవమానంతో ఆత్యహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితుడు తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. సదరు మహిళ కుటుంబసభ్యలు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడుని 29 ఏళ్ల మోహన్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. అతనికి కావ్య శ్రీ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తర్వాత కూడా చదువకోవచ్చని ఆమెకు అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే బాధితుడు మోహన్ వివాహ ఏర్పాట్ల కోసం సుమారు రూ. 10 లక్షలు కాబోయే భార్య కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఐతే మోహన్ గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు కొన్ని రూమర్లు విని పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మోహన్, అతడి కుటుంసభ్యులను అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి....వివాహం రద్దు చేసుకోవాలని సూచించారు. అలాగే డబ్బులు వెనుకకు ఇచ్చేందుకు నిరాకరించడమే గాక పెళ్లిని రద్దు చేసుకోమని ఒత్తిడి చేశారు. అలాగే అమ్మాయిని ఇక ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని, అలాగే తమను బయటకు గెట్టివేసి అవమానించినట్లు మోహన్ తండ్రి రంగస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అవమానం తోపాటు పెళ్లి కూడా రద్దు కావడంతో తన కొడుకు మోహన్ కలత చెంది ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపాడు. మోహన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులానే ఆరోజు కూడా డ్యూటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కాబోయే భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో నిందితులు పరారీలో ఉన్నారు. ఈమేరకు పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం) -
చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...
కోలారు: బెంగుళూరు రూరల్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ కూతురుతో సహా చెరువులోకి దూకిన ఘటన బుధవారం కోలారు తాలూకాలోని కెందట్టి వద్ద చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి గత 3 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చి హోసకోట తాలూకా చక్లాటి బాగలూరు లో నివాసం ఉంటున్న రాహుల్ (27), తన చిన్నారి కూతురు దియా (3)తో సహా చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. చెరువు వద్ద నీలం రంగు ఐ– 10 కారు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులోన గాలించగా పాప శవం దొరికింది, రాహుల్ జాడ తెలియరాలేదు. స్కూల్లో వదిలి వస్తానని వెళ్లాడు: భార్య సమాచారం తెలిసి రాహుల్ భార్య భవ్య ఘటనా స్థలానికి వచ్చి కారు తమదేనని, పాప తన కూతురేనని బోరున విలపించింది. భర్త రాహుల్ కుమార్తెను పొద్దున్నే పాఠశాలలో వదిలి వస్తానని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని ఆమె తెలిపింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. గత ఆరు నెలల కాలంగా రాహుల్ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండేవాడని, దీని వల్ల అప్పులు పెరిగినట్లు భవ్య చెప్పింది. పోలీసు విచారణకు భయపడి చేశాడా? ఇటీవల ఇంట్లో బంగారు నగలు చోరీ అయినట్లు రాహుల్ బాగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు విచారణలో రాహుల్ బంగారాన్ని చెమ్మనూర్ జ్యూవెల్లర్స్‌లో తనఖా పెట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని గట్టిగా మందలించి విచారణకు పిలిచారు. దీంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా అని కోణంలో కోలారు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న కారులో రాహుల్ మొబైల్ ఫోన్, పర్సు అన్నీ ఉన్నాయి. అతడు నిజంగా చెరువులోకి దూకాడా, లేక పరారు అయ్యాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైందో తెలియదు: ఎస్పీ డి.దేవరాజ్ ఐటి ఉద్యోగి రాహుల్‌కు ఏమైందో తెలియదు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. పోలీసుల భయమా, లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. పాపను చెరువులోకి తోసి అతడు పరారై ఉంటాడు అనే అనుమానం కూడా వస్తోంది. (చదవండి: కాల్’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! ) -
హైదరాబాద్ : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి
-
పిల్లల్ని బాగా చూసుకో..
కుత్బుల్లాపూర్: నాకు బతకాలని లేదు.. నా భర్త మంచోడు.. ఇంకో పెళ్లి చేసుకో..పిల్లలని బాగా చూసుకో.. అంటూ ఓ మహిళ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిజిల్లా, మందపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీను, దేవి (32) దంపతులు నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్ ఫేస్–2 సంజీవయ్యనగర్‌లో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీను ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా, దేవి షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్‌గా పని చేసేది. మంగళవారం షాపింగ్ మాల్లో పనికి వెళ్లిన దేవి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచి్చంది. ఇంట్లో ఉన్న భర్తతో తనకు కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో అతను మందులు తెచ్చి ఇచ్చి ఆటో తీసుకుని బయటికి వెళ్లాడు. సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా దేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. స్థానికుల సాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహం పక్కనే సూసైడ్ లెటర్ కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పేట్‌బïÙరాబాద్ ఎస్ఐ రామకృష్ణ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వంచన! ) -
జాబు రాలేదని దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ తీరుతో కొలువు దొరక్క, బతికేందుకూ ఏ ఆసరా లేక, కుటుంబాలకు భారంగా మారలేక నిరుద్యోగ యువత మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నిరుద్యోగ దివ్యాంగుడు కర్నూలు కలెక్టరేట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కోసం సీఎం చంద్రబాబు వద్దకు నాలుగు సార్లు వెళ్లి గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో లక్ష్మణస్వామి అనే దివ్యాంగుడు గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. బేతంచెర్ల మండలం రేపల్లెకు చెందిన లక్ష్మణస్వామి 2009లో డిగ్రీ (బీఏ) పూర్తి చేశాడు. పై చదువులు చదివే స్తోమత లేక, కుటుంబానికి భారం కావడం ఇష్టం లేక ఉద్యోగం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కనీసం స్వయం ఉపాధి కోసమయినా ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అతికష్టమ్మీద అమరావతికి వెళ్లి సీఎం చంద్రబాబును నాలుగుసార్లు కలిశాడు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. పైగా 80 శాతానికి పైగా వైకల్యమున్నా.. ఉద్దేశపూర్వకంగానే తక్కువ చూపి రూ.1,500 పింఛన్‌ను కూడా ఎగవేశారు. లక్ష్మణస్వామికి వివాహం కూడా అయ్యింది. ఇద్దరు కుమారులు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలా ఇంకెన్నాళ్లు బతకాలంటూ తీవ్రవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని జేడీఏ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు వెనక్కి లాగేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని డీఆర్వో వెంకటేశం వద్దకు తీసుకెళ్లారు. లక్ష్మణస్వామి బాధ విన్న డీఆర్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. తర్వాత పట్టించుకోలేదు ‘ఇంటికో జాబు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. దివ్యాంగులం ఉన్నత చదువులు చదువు కొని ఉపాధి కోసం నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు ప్రయత్నించా’ అని లక్ష్మణస్వామి వాపోయాడు. -
ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం
విజయవాడ, అజిత్‌సింగ్‌నగర్: నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నల గుండెలు మండాయి. ఆందోళన బాట పట్టారు. సీఎంను కలిసేందుకు ‘చలో అసెంబ్లీ’కి పయనమయ్యారు. న్యాయం కోసం నినదించిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ప్రతాపం చూపించింది. పోలీసు బలాన్ని ప్రయోగించింది. మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించింది. మనస్తాపానికి గురైన అన్నదాతలు పోలీస్‌స్టేషన్‌లోనే ఆందోళన చేపట్టారు. ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. నున్న పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత: న్యాయం కోసం వచ్చిన తమను అరెస్టు చేయడంపై రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ కర్కశత్వాన్ని జీర్ణించుకోలేక ముగ్గురు కౌలు రైతులు బి.పూర్ణచంద్రరావు, వి.తిరపతయ్య, జి.రామయ్య నున్న పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకొని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
బ్యాంకు ఆవరణలో రైతు ఉరేసుకునే యత్నం
కరీంనగర్: రుణం ఇవ్వడం లేదని జిల్లాలో ఓ రైతు బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి అక్కడున్న వారు అప్రమత్తమై అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నర్సయ్య అనే రైతు గంగాధరలో తనకు బ్యాంకు రుణం ఇవ్వడం లేదని, ఎన్నిమార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు అవరణలోనే ఉరేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐదేళ్ల కిందట రూ.6.75లక్షల మొత్తాన్ని ఇంటి రుణంగా తీసుకొని ఇప్పటివరకు చెల్లించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
పిల్లలతో కలసి తల్లి చావాలనుకుంది
రాంగోపాల్‌పేట్(సికింద్రాబాద్): భర్తతో తలెత్తిన గొడవల కారణంగా ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం...పార్శీగుట్టకు చెందిన బి. కిరణ్‌కుమార్, రంజిత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే, రంజితకు రోజూ కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో పిల్లలను కూడా సరిగా పట్టించుకోవటం లేదని భర్త్త కిరణ్ ప్రశ్నించటంతో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చనిపోవాలని నిశ్చయించుకుంది. ఇద్దరు పిల్లలను తీసుకుని గురువారం రాత్రి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. అనుమానాస్పదంగా ఉన్న ఆమెను గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు ప్రశ్నించగా విషయం చెప్పింది. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ఇన్స్పెక్టర్ శ్రీదేవి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.