బ్యాంక్ రుణం ఇవ్వడం లేదని కరీంనగర్ జిల్లాలో ఓ రైతు బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
కరీంనగర్: రుణం ఇవ్వడం లేదని జిల్లాలో ఓ రైతు బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి అక్కడున్న వారు అప్రమత్తమై అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నర్సయ్య అనే రైతు గంగాధరలో తనకు బ్యాంకు రుణం ఇవ్వడం లేదని, ఎన్నిమార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు అవరణలోనే ఉరేసుకునే ప్రయత్నం చేశాడు.
దీంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐదేళ్ల కిందట రూ.6.75లక్షల మొత్తాన్ని ఇంటి రుణంగా తీసుకొని ఇప్పటివరకు చెల్లించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.