రైతుల సమ్మతితోనే భూములు తీసుకోవాలి | formers meeting in seethanagaram | Sakshi
Sakshi News home page

రైతుల సమ్మతితోనే భూములు తీసుకోవాలి

Published Fri, Jan 27 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు మండలంలోని చినకొండేపూడి శ్రీషిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమావేశమయ్యారు. నాగంపల్లి, చినకొండేపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి గ్రామాల

  • మాజీ ఎంపీ మిడియం బాబూరావు
  • సీతానగరం :
    పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు మండలంలోని చినకొండేపూడి శ్రీషిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమావేశమయ్యారు. నాగంపల్లి, చినకొండేపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి గ్రామాల రైతుల సమావేశంలో నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. మిడియం బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 26న 11–1 నోటిఫికేష¯ŒS ఇచ్చిందన్నారు. దీని ప్రకారం 60 రోజులలో మీ అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడు గ్రామసభలు నిర్వహించాలని వివరించారు.  పోలవరం ప్రాజెక్ట్‌ 2019కి పూర్తయితే పురుషోత్తపట్నం, పట్టిసీమ పథకాలు అవసరం లేదని బాబురావు తెలిపారు. అధికారులు రెండు, మూడు ఆప్షన్లు ఇచ్చి, రైతులను గందరగోళంలో ఉంచి, ఏ విధంగానైనా భూములను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టాలని, కలెక్టర్‌ చెప్పిన లెక్కలు తప్పని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ సమావేశ విషయాలను రైతులు వీరికి వివరించారు. కార్యక్రమంలో కరుటూరి శ్రీనివాస్, కొండు రమేష్, ఈలి రామారావు, చళ్లమళ్ల సుజీరాజు, కలగర బాలకృష్ణ, కోడేబత్తుల ప్రసాదరావు, ఉండవల్లి రమేష్, గద్దె బాపూజీ, అల్లూరి శివగణేష్, కర్లపూడి రాంబాబు, చేకూరి సత్యనారాయణరాజు, బొమ్మిరెడ్డి కోటేశ్వరావు, చిలకాని వీర్రాజు,  యనమదల శ్రీను, తొటకూర పల్లపురాజు,చిన్న సూరిబాబు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement