in seethanagaram
-
రైతుల సమ్మతితోనే భూములు తీసుకోవాలి
మాజీ ఎంపీ మిడియం బాబూరావు సీతానగరం : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు మండలంలోని చినకొండేపూడి శ్రీషిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమావేశమయ్యారు. నాగంపల్లి, చినకొండేపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి గ్రామాల రైతుల సమావేశంలో నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. మిడియం బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 26న 11–1 నోటిఫికేష¯ŒS ఇచ్చిందన్నారు. దీని ప్రకారం 60 రోజులలో మీ అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడు గ్రామసభలు నిర్వహించాలని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ 2019కి పూర్తయితే పురుషోత్తపట్నం, పట్టిసీమ పథకాలు అవసరం లేదని బాబురావు తెలిపారు. అధికారులు రెండు, మూడు ఆప్షన్లు ఇచ్చి, రైతులను గందరగోళంలో ఉంచి, ఏ విధంగానైనా భూములను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టాలని, కలెక్టర్ చెప్పిన లెక్కలు తప్పని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ సమావేశ విషయాలను రైతులు వీరికి వివరించారు. కార్యక్రమంలో కరుటూరి శ్రీనివాస్, కొండు రమేష్, ఈలి రామారావు, చళ్లమళ్ల సుజీరాజు, కలగర బాలకృష్ణ, కోడేబత్తుల ప్రసాదరావు, ఉండవల్లి రమేష్, గద్దె బాపూజీ, అల్లూరి శివగణేష్, కర్లపూడి రాంబాబు, చేకూరి సత్యనారాయణరాజు, బొమ్మిరెడ్డి కోటేశ్వరావు, చిలకాని వీర్రాజు, యనమదల శ్రీను, తొటకూర పల్లపురాజు,చిన్న సూరిబాబు పాల్గొన్నారు. -
భూసేకరణ హక్కు ప్రభుత్వానికి ఉంది
కలెక్టర్ అరుణ్‌కుమార్ సీతానగరం (రాజానగరం) : ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైతుల నుంచి భూసేకరణ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయే నాగంపల్లి, చినకొండేపూడి రైతుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2013 నూతన భూసేకరణ చట్టం ప్రకారం ఈ పథకానికి 285 ఎకరాల భూమి సేకరించవలసి ఉందన్నారు. నాగంపల్లి రెవెన్యూకు ప్రాజెక్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేశామన్నారు. మిగిలిన గ్రామాలకు ప్రాజెక్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేస్తామన్నారు. నాగంపల్లిలో ప్రభుత్వ ధర (బేసిక్వాల్యూ) రూ.6 లక్షలు ఉందని, చినకొండేపూడిలో రూ.7 లక్షలు ఉందన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని నాగంపల్లి భూములకు ఎకరానికి రూ 15.35 లక్షలు, చినకొండేపూడి భూమికి ఎకరానికి రూ 17.91 లక్షలు వస్తాయన్నారు. దశలవారీగా భూసేకరణ చేస్తామన్నారు. దేవీపట్నంలో ప్రభుత్వ ధర రూ 2.50 లక్షలు ఉందని, అక్కడ రూ.7 లక్షల నుంచి రూ.7.50 లక్షలు అందించామన్నారు. అయితే రైతులు అందించే భూములకు ధర పెంచాలని ప్రభుత్వాన్ని కోరవచ్చని, ఎంతవరకు అందిస్తారనేది చెప్పలేమన్నారు. రామచంద్రపురం, పురుషోత్తపట్నం రైతులతో సమావేశం జరుపుతామన్నారు. రైతుల అభిప్రాయాలు తెలియపర్చాలని కలెక్టర్ ఆరుణ్‌కుమార్ సూచించారు. సమావేశం అనంతరం తెలియజేస్తాం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయే పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రైతులతో సమావేశం జరిపి, తమ అభిప్రాయాలను తెలియపర్చుతామని రైతులు ఐఎస్ఎ¯ŒS రాజు, కర్లపూడి రాంబాబు, కర్లపూడి భాస్కరరావు, యనమదల శ్రీను, కొత్తపల్లి వీర్రాజులు అన్నారు. రైతులను విభజించి సమావేశం నిర్వహించడం సబబు కాదని, నాలుగు గ్రామాల రైతులతో సమావేశం జరపాలని యనమదల శ్రీను కోరారు. భూసేకరణలో ప్రభుత్వం చెల్లించే ధరకు ఇక్కడ రైతులు సుముఖంగా లేరని తెలిపారు. భూమి కోల్పొయే రైతులకు అయిదు నుంచి పదిసెంట్లు మిగిలితే వ్యవసాయానికి పనికి రాదని ఆ మిగిలిన కొద్దిపాటి భూమికి ప్రభుత్వం ధర చెల్లించాలని కోరారు. రాజమహేంద్రవరం ఇ¯ŒSచార్జ్ సబ్ కలెక్టర్ ఎం.జ్యోతి, ఎల్ఎంసీ ఎస్సీ సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ వెంకట్రావు, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీవో శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.