‘ఉప్ప’ నీటితో పంటలు మునక | salt water problems | Sakshi
Sakshi News home page

‘ఉప్ప’ నీటితో పంటలు మునక

Published Tue, Dec 13 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

salt water problems

  • మేజర్‌ డ్రెయి¯ŒS పోటెత్తి వేలాది ఎకరాలకు నష్టం
  • నారు మడులకూ దెబ్బే...
  • గగ్గోలు పెడుతున్న రైతులు
  • ఉప్పలగుప్తం :
    వార్దా తుఫా¯ŒS ప్రభావంతో పెద్ద ఎత్తున సముద్రపు నీరు కూనవరం మేజర్, మైనర్‌ డ్రెయి¯ŒSలకు చేరడంతో తీరప్రాంత మండలం ఉప్పలగుప్తంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు ఉప్పు నీటిమయంగా మారిపోయాయి. రబీ పంటకు సిద్ధం చేసిన నారు మడులు, ఇప్పటికే వేసిన నాట్లు ఉప్పునీటి పాలయ్యాయి. కూనవరం మేజర్‌ డ్రెయి¯ŒSకు అనుసంధానంగా ఉన్న అన్ని మైనర్‌ డ్రెయిన్లు ఉప్పు నీటితో నిండిపోవడంతో వాటిని అనుకుని ఉన్న పంట చేలన్నీ చెరువులుగా మారిపోయాయి. మండలంలో ఉప్పలగుప్తం, పేరాయి చెరువు, ఆదిలక్షి్మపురం, వానపల్లిపాలెం, ఎ¯ŒS కొత్తపల్లి గ్రామాల్లో పంట పొలాలతోపాటు పాత అయినాపురం, ఎ¯ŒS కొత్తపల్లి, గొరగనమూడి, రంగరాజు, దసరాబుల్లోడు కోడు, ఉత్తర, దక్షిణ పికలేరు డ్రెయి¯ŒSలలో ఉప్పునీరు చేరి ఆయా డ్రెయిన్ల పరిధిలో పంట పొలాలకు నష్టం కలిగించింది.
    నారుమడులకు తీవ్ర నష్టం...
    సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఉన్న రబీ నారు మడులకు ఉప్పునీటి వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని మండల వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు చిక్కం బాల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉప్పునీటి ముంపులో వారం, రెండు వారాలు దాటని నారే ఉందని, ఈ దశలో  నారు పూర్తిగా మాడిపోతుందన్నారు. జరిగిన నష్టంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని, తిరిగి నారు మడులు వేసుకునేలా ప్రభుత్వం రైతుకు ఉచితంగా విత్తనాలు అందించాలన్నారు. వ్యవసాయాధికారి వై.శోభ ఉప్పు నీటితో నిండిన పంట పొలాలను ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం ప్రాంతాల్లో మంగళవారం పరిశీలించారు. మునిగి ఉన్న నారుమడులకు నష్టం తప్పదన్నారు.  రైతులు ఇంజిన్లు పెట్టి నీరు బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫలితం ఉండక పోవచ్చన్నారు. జరిగిన నష్టం అంచనా వేస్తున్నామని చెప్పారు. 
    రెగ్యులేటర్‌ లేకనే తరచూ ఉప్పునీరు:
    మూడు మండలాల నుంచి 30 వేల ఎకరాల్లో ముంపునీరు దిగే మార్గమున్న కూనవరం మేజర్‌ డ్రెయి¯ŒSకు సముద్రపు మొగ తెరుచుకుని ఉన్నందున వార్దా తుఫా¯ŒSతో వచ్చిన సముద్రపు పోటు నీరంతా డ్రెయి¯ŒS ద్వారా పంట చేలను నష్టపరిచింది. కూనవరం మొగ వద్ద రెగ్యులేటర్‌ లేకపోవడం, మేజర్‌ డ్రైయి¯ŒS నుంచి మైనర్‌ డ్రెయి¯ŒSలకు ఉన్న మార్గాల్లో షట్టర్‌లు (లాకులు) లేకపోవడంతో సముద్రపు నీరు నేరుగా పంట పొలాలను తాకింది. భారీ వర్షాల వల్ల వచ్చే ముంపు నీరు కూనవరం మొగ ద్వారానే సముద్రంలో కలవాలి. వర్షాలు లేకపోవడంతో సాధారణ స్ధితిలో ఉన్న డ్రెయిన్లకు ఎగదన్నిన సముద్రపు నీరు డ్రెయిన్ల పొడవునా ఎగబాకింది. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల గట్లు దాటి మరీ ఉప్పునీరు పంట చేలను చెరువుల్లా మార్చేసింది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement