salt water
-
అరుదైన లాంతరు.. ఉప్పునీటితో వెలుగుతుంది
దీపం వెలగాలంటే ఏం కావాలి? పాతకాలం దీపాలకైతే, నూనె కావాలి. ఇప్పటి దీపాలకైతే కరెంటు కావాలి. కనీసం బ్యాటరీ కావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంతరుదీపానికి మాత్రం ఉప్పునీరు ఉంటే చాలు. ఇది వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు కూడా. ‘లైట్‌పల్స్ ఎకో లాంతర్’ పేరిట ‘గ్యాలప్ ఇన్నోటెక్’ అనే చైనా కంపెనీ రూపొందించింది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటూ ఉంది. చదవండి: ప్రపంచంలోనే సన్న భవనం -
ఆవు పేడతో మంచినీళ్లు.. ఎలా తయారు చేస్తారో తెలుసా?
భూమి ఉపరితలంపై 70శాతానిపైగా నీళ్లే. అయినా తాగేనీటికి కరువే. కానీ సముద్రాల ఉప్పునీటిని ఆవు పేడ సాయంతో మంచినీటిగా మార్చే సరికొత్త టెక్నాలజీకి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఎండను ఆధారంగా చేసుకుని.. పెద్దగా ఖర్చేమీ లేకుండానే.. మంచినీటిని తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టాలు తీర్చే ఈ పరిశోధన వివరాలేమిటో తెలుసుకుందామా.. నీటి కరువులో 142 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కలిపి సుమారు 142 కోట్ల మంది నీటి కరువుతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా. పక్కనే సముద్రాలు ఉన్నా.. తాగేనీటి కోసం ఇబ్బందిపడే ప్రాంతాలు ఎన్నో. అలాంటి చోట్ల ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకుని వినియోగించాల్సిన పరిస్థితి. దీనికోసం భారీగా వ్యయం అవుతుంది. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం చూపడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆవుపేడతోపాటు మరికొన్ని ఇతర పదార్థాలతో నీటిని శుద్ధిచేసే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: వయసు వందకు పైనే.. ‘ఔరా’ అనిపిస్తున్న బామ్మలు సూర్యరశ్మితో నీటిని వేడి చేసి.. శాస్త్రవేత్తలు ఫోమ్‌ను సముద్రపు ఉప్పునీటిపై ఉంచి ఎండతగిలేలా ఏర్పాటు చేశారు. నీటిపై తేలుతున్న ఫోమ్ సూర్యరశి్మని శోషించుకుని వేడెక్కడం మొదలుపెట్టింది. ఆ వేడి సూక్ష్మగొట్టాల ద్వారా దిగువన నీటికి చేరింది. అక్కడ నీరు ఆవిరై.. దానిలోని ఉప్పు, ఇతర లవణాలు విడిపోయాయి. స్వచ్ఛమైన నీరు, ఆవిరి సూక్ష్మగొట్టాల ద్వారా ఫోమ్ పైభాగానికి వచ్చాయి. శాస్త్రవేత్తలు పలు పరికరాలను ఫోమ్‌కు అనుసంధానం చేసి ఆ నీటిని సేకరించారు. దానిలో లవణాలు, ఇతర అంశాలను పరీక్షించి.. తాగడానికి పూర్తి అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. చదవండి: ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు ఫోమ్‌లా రూపొందించి.. శాస్త్రవేత్తలు ఆవు పేడతోపాటు ఎండిపోయిన ఆకులు, పీతలు, నత్తల షెల్స్‌ను కలిపి.. తీవ్ర ఒత్తిడి వద్ద 1,700 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు వేడిచేశారు. దీనితో ఈ పదార్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు నశించి.. పొడి కర్బన పదార్థం ఏర్పడింది. ఈ కర్బన పదార్థానికి అత్యంత చిక్కని నలుపు రంగును ఇచ్చే ‘కెటిల్ ఫిష్’ఇంకును కలిపారు. ఈ మిశ్రమంతో ఫోమ్ (గుల్లగా ఉండే డస్టర్ వంటి అతితేలికైన పదార్థం)ను తయారుచేశారు. అత్యంత సూక్ష్మమైన గొట్టాల వంటి నిర్మాణంతో ఉండే ఈ ఫోమ్.. నీటిని సమర్థవంతంగా పీల్చుకోవడంతోపాటు ఉపరితలంపై తేలుతూ ఉంటుంది. ఉప్పునీటి శుద్ధికి యంత్రాలున్నా.. ► ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను డీసాలినేషన్ అంటారు. ఇందుకోసం ఇప్పటికే పలు విధానాలు ఉన్నాయి. కానీ అందులో వాడే ఫిల్టర్ల ధర ఎక్కువ. చాలా విద్యుత్ అవసరమవుతుంది. దీనివల్ల నీటి శుద్ధికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే గల్ఫ్, ఇతర ధనిక దేశాలు మినహా ఎక్కడా ఈ పరికరాలను వినియోగించడం లేదు ► తాజాగా నార్త్ఈస్టర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫోమ్ తయారీలో పూర్తిగా వ్యర్థాలనే వాడటం, విద్యుత్ అవసరం లేకపోవడంతో.. ఖర్చు తక్కువ. ఈ విధానాన్ని అంతటా వినియోగించవచ్చని, కోట్లాది మంది కష్టాలు తీరుతాయని శాస్త్రవేత్త యిజెంగ్ తెలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువుల్లో నీళ్లు ఉన్నా నేరుగా తాగలేం. వాటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర సూక్ష్మజీవులతో కలుíÙతం అయి ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటిచోట్ల కూడా ఈ కొత్త విధానంలో నీటిని శుద్ధి చేసుకుని తాగవచ్చని యిజెంగ్ పేర్కొన్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
35 గ్రామాలకు ఉప్పునీరే దిక్కు ..
సాక్షి, వాకాడు: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మండలంలోని 35 తీర ప్రాంత గ్రామాల్లో గత ఐదేళ్లుగా ఉప్పు జలగండం పట్టి పీడిస్తోంది. నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. తీరప్రాంత వాసులకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలో 68 గ్రామాల్లో 10.5 వేల కుటుంబాలు, 38 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 204 చేతి పంపులు ఉండగా, వాటిలో 164 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. నిడిగుర్తి, రెడ్డిపాళెం, బాలాజీ నగర్, నిమ్మవానితిప్ప, వేణుగోపాల్‌పురం, నిడిగుర్తి గొల్లపాళెం, శ్రీహరిపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు, అంజలాపురం, కాకివాకం, పంబలి, నిడిగుర్తి, శ్రీపురం, తీపలపూడి, మూలపడవ, రాజ్యలక్ష్మీపురం, మొనపాళెం, వైట్‌కుప్పం, నలగామల, పున్నమానితిప్ప, నిడిగుర్తి గొల్లపాళెం, రెడ్డిపాళెం, మాధవాపురం, ముట్టెంబాక, కల్లూరు, దుర్గవరం, పల్లెపాళెం ఇలా 35 గ్రామాల్లో వేసవి వస్తే సరి త్రాగునీరు ఉప్పునీరుగా మారిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. ఐతే వీరి గురించి అధికార పక్షం నాయకులు గానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వీరికి సురక్షిత మంచినీరు అందించేందుకు వాకాడు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన పాత పైలెట్ ప్రాజెక్టు పట్ల పాలకులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు సక్రమంగా అందడంలేదు. అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి మరమ్మత్తులకు గురైనప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా తీర గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు ద్వారా నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులు, దాతల చందాలతో మంచినీరు దొరికే ప్రాంతాల్లో గ్రామస్తులే బోరు పాయింట్లు నిర్మించుకుని తాగునీరు తెచ్చుకుంటున్నారు. తీరప్రాంత గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పునీరు పనికిరాదు. మండలంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కొరకు వాకాడు స్వర్ణముఖి వద్ద మరో మంచినీటి ప్రాజెక్టు నిర్మించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తాగేందుకు ఉప్పునీరే గతి స్నానాలు చేయాలన్నా.. వంట చేసుకోవాలన్నా ఉప్పునీరు కావడంతో చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్లు తాగి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైనా పట్టణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా త్రమే మంచినీళ్లు తాగుతున్నాం. మిగిలిన సమయంలో ఉప్పునీరే తాగుతున్నాం.– నల్లపురెడ్డి మునస్వామిరెడ్డి, వేణుగోపాలపురం ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం గ్రామాల్లో లభిస్తున్న ఉప్పునీరు కారణంగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నాం. సిమెంటులో ఉప్పునీరు కలిపితే నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. మండలంలోని 35 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. – మునస్వామి, ఓడపాళె ఆందోళన చేసినా పట్టించుకోలేదు గ్రామంలో తాగునీరు ఉప్పునీరుగా మారి ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై అనేక సార్లు ఆందోళన చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఉప్పునీరు తాగే బతుకుతున్నాం.– పోలయ్య మత్స్యకార కాపు, కొండూరుపాళెం -
కదిలించిన ‘ఉప్పునీరు’
పుట్టిన ఊరిని ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పట్టించుకోలేదు.. ఉద్ధరిస్తాడనుకుంటే కష్టాల దారిలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో సమస్యలతో సావాసం చేస్తున్న నడిమివాడ గ్రామస్తుల దయనీయ దుస్థితిపై సాక్షి ప్రచురించిన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వ పథకాలేవీ వారి దరి చేరలేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.. తక్షణం గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలంటూ మండల అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో స్థానిక అధికారులు గ్రామాన్ని హుటాహుటిన సందర్శించారు. నడిమివాడలో ఉండే ప్రతి సమస్యనూ సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ సాక్షికి తెలిపారు. విశాఖసిటీ, పెదబయలు: ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు స్వగ్రామంలో గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘విప్ ఊరు.. ఉప్పు నీరు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రచురించిన కథనంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. గిన్నెలకోట పంచాయితీ నడిమివాడ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షిపత్రికలో చదివిన ఆయన మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులు, తాగునీటి సమస్యతో పాటు పింఛన్ కష్టాలు, పౌష్టికాహార లోపం, సాగునీటి కష్టాలకు సంబంధించిన అన్ని వివరాలూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో వసంతరావు నాయక్ సోమవారం హుటాహుటిన నడిమివాడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తాగుతున్న ఊట నీటిని, గ్రామంలో ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయా లేదా అనే వివరాల గురించి అ డిగి తెలుసుకున్నారు. గ్రామంలో 9 కుటుంబాలు ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని, మట్టి ఇళ్లల్లో ఉంటూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పైకప్పు పెంకులు పగిలిపోతే పాలిథిన్ టార్ఫాలిన్ కవర్లు కట్టుకుని నివాసం ఉంటున్నామంటూ గోడు వెలి బుచ్చారు. అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గంలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఏకరువుపెట్టారు. గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టు నిర్మాణం చేస్తే.. ఉపాధి కోసం ఆవలి ప్రాంతాలకువెళ్లే మార్గం సుగమమవుతుందని ప్రజలు తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అం దించేందుకు గ్రామానికి మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. నడిమివాడ, గుండాలగరువు గ్రామాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇంజరి పంచాయతీ చెందిన మల్లెపుట్టు గ్రామంలోని అం గన్వాడీ కేంద్రానికి వెళ్లి ఫీడింగ్ సరుకులు తీసుకొ చ్చేందుకు నరక యాతన అనుభవిస్తున్నారని ఎం పీడీవో ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గ్రామంలో పంట భూములకు నీరందించేందుకు సరియాల గెడ్డ సమీపంలో, కొండవాలు గెడ్డ ప్రాం తాల్లో చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఉపాధి పొందేందుకు కాఫీ మొక్కలు పంపిణీ చేయాలని కోరారు. మరోవైపు.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవి పట్టన్‌శెట్టి సాక్షి కథనంపై స్పందిస్తూ గ్రామంలో తాగునీటిసమస్య పరిష్కరించేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చెయ్యాలని ఆర్‌డబ్లు్యఎస్ విభా గం అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నడిమివాడ గ్రామంలో ఆర్‌డబ్లు్యఎస్ సైట్ ఇంజనీర్ మత్స్యలింగం సోమవారం పర్యటించా రు. గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ నిర్మించిన గ్రావిటీ పథకం నిరుపయోగంగా ఉండటాన్ని గమనించి ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే మరమ్మతులు చేసి పథకాన్ని అందుబాటులో తెచ్చేందుకు వెలుగు పథకం ద్వారా నిదులు కేటాయించాలని ఐటీడీఏ పీవో ఆదేశించారని ఆర్‌డబ్లు్యఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీ ర్ రాంప్రసాద్ తెలిపారు. పెదబయలు ఆర్‌డబ్లుఎస్ జేఈ జగదీష్ సైతం నడిమివాడ గ్రామాన్ని సందర్శించి వాటర్ స్కీం మరమ్మతుల కోసం అయ్యే అంచనాల్ని రూపొందించి ఒకవారంరోజుల్లో గ్రావిటీ స్కీంని వినియోగంలోకి తీసుకు వస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో పాటు గ్రామాన్నే మరిచిపోయారు.. మీరలా కాకూడదంటూ ఎంపీడీవోని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : ఎంపీడీవో వసంతరావు నాయక్ నడిమివాడ గ్రామానికి తాగునీరు, పక్కా గృహాలు , రోడ్డు, కల్వర్టు సమస్యలు ఉందని ఎంపీడీవో వి.వసంతరావునాయక్ తెలిపారు. గ్రామంలో 3 వేల మీటర్లు దూరంలో ఉన్న అంబలిమామిడి కొండ ప్రాంతం నుంచి గ్రావిటీ పథకం మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టుకు ప్రతిపాధనలు పంపిస్తామన్నారు. గ్రామంలో 9 కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తామని, నడిమివాడ, గుండాలగరువు గ్రామాలకు కలిపి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. ఉపాధి పథకం ద్వారా చెక్‌డ్యాంలు మంజూరు చేస్తామని, అర్హులకు పింఛన్లు, గ్రామంలో డ్వాక్రా సంఘానికి పçసుపు కుంకుమ డబ్బులతో పాటుగా బ్యాంకు రుణాలు అందే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. ఎంపీడీవోతో పాటు డివిజన్ సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు పాంగి సింహాచలం పంచాయతీ కార్యదర్శులు నాగేశ్వరరావు, కాంతరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఉప్పుతిప్పలు
యలమంచిలి : పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఉప్పునీరువల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కారణం ఏమిటంటే.. పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 2,088 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ పొలాలకు నక్కల డ్రెయిన్ నీటిని చించినాడ కాల్వలోకి తోడి పంట చేలకు ఇస్తున్నారు. అయితే నక్కల డ్రెయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంతో పంటలు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనిపై గత డిసెంబర్లోనే దాళ్వాకు నక్కల డ్రెయిన్ నీటిని ఎత్తిపోయవద్దని అధికారులను వేడుకున్నారు. డిసెంబర్ 27న పెనుమర్రు ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చిన నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి తమ గోడు విన్నవించుకున్నారు. రూ.కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నీరు తమకు వద్దని రైతులు స్పష్టం చేశారు. దీనిపై ఆయన రైతులను ప్రశ్నించగా, నక్కల డ్రయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా చేలకు తోడితే పైరు చౌడు బారిపోతుందని చెప్పారు. దిగుబడీ గణనీయంగా తగ్గుతుందన్నారు. దీంతో ఆయన నక్కల డ్రెయిన్‌లోని నీటిని పరీక్ష చేయించగా 0.8 శాతం ఉప్పు సాంద్రత ఉన్నట్టు నివేదిక వచ్చింది. దీనిపై వ్యవసాయ అధికారి జాన్సన్‌ను పిలిచి వరి సాగుకు ఎంత ఉప్పు శాతం ఉండవచ్చునని అడగ్గా 4 శాతం వరకూ ఉండవచ్చని చెప్పారు. దీంతో గాంధీ జనవరి 10వ తేదీ వరకు దమ్ములు పూర్తి కావడానికి మాత్రమే ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తోడతామని రైతులకు చెప్పారు. ప్రస్తుతం 0.8 శాతం మాత్రమే ఉప్పు ఉంది కాబట్టి పరీక్ష యంత్రాన్ని నీటి సంఘ అధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు వద్ద ఉంచుతామని, జనవరి 10 లోపు ఎప్పుడు రెండు శాతానికి మించి ఉప్పు వచ్చినా వెంటనే మోటార్లు ఆపివేస్తామని హామీనిచ్చారు. అక్కడి నుంచి మార్చి 31వ తేదీ వరకు పంటకాల్వ నీరే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఆ హామీలు అమలు కాలేదు. మార్చి వచ్చినా ఎత్తిపోతల నీటినే తోడుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వడం వలన రైతులు నష్టాలపాలవుతున్నారు. అందుకే నారుమడలు వేయకుండానే సాగు చేయలేమని చెప్పారు. సాక్షాత్తు సబ్ కలెక్టర్ వచ్చి దమ్ముల వరకే ఎత్తిపోతల పథకం నీరు తోడతామని, మార్చి నెలాఖరు వరకు కాల్వ నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నమ్మి సాగుచేసి మోసపోయారు. – తోటకూర వెంకట్రామరాజు, మాజీ సర్పంచ్, పెనుమర్రు నక్కల డ్రెయిన్‌లో 5శాతం ఉప్పు ఉంది పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టులో రావిపాడు, పెనుమర్రు, మేడపాడు, యలమంచిలి, కట్టుపాలెం, శిరగాలపల్లి గ్రామాలలో 2,088 ఎకరాలు సాగవుతోంది. నక్కల డ్రెయిన్ నీటిలో 5 శాతం ఉప్పు ఉంది. ఆ నీటిని పంట చేలకు పెడితే గింజలన్నీ చౌడుబారి పోయి రైతులు నష్టపోతారు. కాల్వ నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల నుంచి నీరు తోడవద్దని రైతులు ఎంత మొత్తుకుంటున్నా అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యంలా ఉన్నాయి. – పాకా సూర్యనారాయణ, రైతు -
ఉప్పు నీటిలోనూ వరి పంట
చవుడు నేలల్లో వరి పండుతుందా? అసలు పండదన్నది నిన్నమొన్నటి మాట.. ఇకపై ఆ మాట చెల్లదు.. చైనా శాస్త్రవేత్తలు ఉప్పు నీటిలో వరి పండించడమే కాకుండా సాధారణ వరి మాదిరిగానే దిగుబడులూ సాధించారు. చైనా హైబ్రిడ్ వరి వంగడాల పితామహుడిగా పేరొందిన యువాన్ లాంగ్పింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కింగ్‌డావులో జరిపిన ప్రయోగాల ద్వారా కనీసం 4 వంగడాలు ఉప్పును తట్టుకుని మరీ పెరగగలవని తేలింది. దాదాపు 200 రకాల వరి వంగడాలను వేర్వేరు ఉప్పు మోతాదులున్న నీటిలో పండించినప్పుడు నాలుగు వంగడాలు ఉప్పు ప్రభావాన్ని అధిగమించాయి. ముందుగా వీటన్నింటికి మూడు శాతం లవణాలున్న నీటిని అందించారు. ఆ తరువాత క్రమేపీ ఉప్పు మోతాదును ఆరు శాతానికి పెంచారు. హెక్టారుకు 4.5 టన్నుల వరకు దిగుబడులు వస్తాయని తొలుత అంచనా వేయగా.. అవి కాస్తా 9.3 టన్నులు పండటంతో ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతైంది. చైనాలో దాదాపు పది కోట్ల హెక్టార్ల చవుడు నేలలు ఉన్నాయని, వీటిల్లో ఈ రకమైన వరి వంగడాలు పండిస్తే రైతుకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందని లాంగ్పింగ్ బృందం అంచనా వేస్తోంది. కొత్త వంగడాలను మరింత మెరుగుపర చడంతో పాటు సాగు పద్ధతులను ప్రామాణీకరించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నామని వారు వివరించారు. -
ఉప్పునీటిని మంచినీరుగా మార్చే గ్రాఫిన్
న్యూయార్క్: సముద్రంలోని ఉప్పు నీటిని అతి తక్కువ ఖర్చుతో అత్యంత సులభంగా మంచినీటిగా మార్చే ‘గ్రాఫిన్ పొర’ను అమెరికాలోని మాంచెస్టర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ పొరతో కూడిన పాత్రను తీసుకెళ్లి ఉప్పునీళ్లను మంచినీరుగా మార్చుకొని తాగవచ్చు. ఉప్పు నీటి నుంచి లవణాలను తొలగించే ప్రక్రియలో తాము సష్టించిన గ్రాఫిన్ పొర విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని ప్రొఫెసర్ రవి శిల్వ తెలిపారు. రాగికన్నా దఢమైన వాహకం, ఉక్కుకన్నా రెండువందల రెట్లు బలంగా ఉండి ర బ్బరుకన్నా తేలిగ్గా వంగే గుణమున్న ‘హానీకోమ్ లాటిస్’కు కార్బన్ అణువులను జోడించడం ద్వారా అద్భుతమైన గ్రాఫిన్ మెటీరియల్‌ను తాము ల్యాబ్‌లో సష్టించామని ఆయన చెప్పారు. ఈ గ్రాఫిన్‌ను 2004 సంవత్సరంలోనే తయారు చేయగా, ఇప్పుడు దాన్ని ఉపయోగించి నీటిలో నుంచి ఉప్పును ఎంత సమర్థంగా ఫిల్టర్ చేయవచ్చునో కనుగొన్నామని ఆయన చెప్పారు. భారత దేశంలో సముద్ర జలాలను మంచినీరుగా మార్చే (నిర్లవణీకరణ) అతి పెద్ద ప్లాంట్ చెన్నైకి సమీపంలోని కట్టుపల్లి వద్ద ఉన్న విషయం తెల్సిందే. దాన్ని 60 ఎకరాల్లో ఏర్పాటు చేయగా చిన్న స్థాయిలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఫిబ్రవరి నెలలోనే ప్రారంభించారు. ఇలాంటి ప్లాంటులను ప్రపంచంలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ఎకరాల కొద్ది స్థలాలు, కోట్లాది రూపాయల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అయితే మాంచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు గ్రాఫిన్ మెటీరియల్‌తో అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్ ఫిల్టర్లను తయారు చేసి ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇలాంటి ఫిల్టర్లు మార్కెట్లోకి రావడానికి మరెంతకాలం పడుతుందో పరిశోధకులు తెలియజేయలేదు. -
‘ఉప్ప’ నీటితో పంటలు మునక
మేజర్ డ్రెయి¯ŒS పోటెత్తి వేలాది ఎకరాలకు నష్టం నారు మడులకూ దెబ్బే... గగ్గోలు పెడుతున్న రైతులు ఉప్పలగుప్తం : వార్దా తుఫా¯ŒS ప్రభావంతో పెద్ద ఎత్తున సముద్రపు నీరు కూనవరం మేజర్, మైనర్ డ్రెయి¯ŒSలకు చేరడంతో తీరప్రాంత మండలం ఉప్పలగుప్తంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు ఉప్పు నీటిమయంగా మారిపోయాయి. రబీ పంటకు సిద్ధం చేసిన నారు మడులు, ఇప్పటికే వేసిన నాట్లు ఉప్పునీటి పాలయ్యాయి. కూనవరం మేజర్ డ్రెయి¯ŒSకు అనుసంధానంగా ఉన్న అన్ని మైనర్ డ్రెయిన్లు ఉప్పు నీటితో నిండిపోవడంతో వాటిని అనుకుని ఉన్న పంట చేలన్నీ చెరువులుగా మారిపోయాయి. మండలంలో ఉప్పలగుప్తం, పేరాయి చెరువు, ఆదిలక్షి్మపురం, వానపల్లిపాలెం, ఎ¯ŒS కొత్తపల్లి గ్రామాల్లో పంట పొలాలతోపాటు పాత అయినాపురం, ఎ¯ŒS కొత్తపల్లి, గొరగనమూడి, రంగరాజు, దసరాబుల్లోడు కోడు, ఉత్తర, దక్షిణ పికలేరు డ్రెయి¯ŒSలలో ఉప్పునీరు చేరి ఆయా డ్రెయిన్ల పరిధిలో పంట పొలాలకు నష్టం కలిగించింది. నారుమడులకు తీవ్ర నష్టం... సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఉన్న రబీ నారు మడులకు ఉప్పునీటి వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని మండల వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు చిక్కం బాల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉప్పునీటి ముంపులో వారం, రెండు వారాలు దాటని నారే ఉందని, ఈ దశలో నారు పూర్తిగా మాడిపోతుందన్నారు. జరిగిన నష్టంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని, తిరిగి నారు మడులు వేసుకునేలా ప్రభుత్వం రైతుకు ఉచితంగా విత్తనాలు అందించాలన్నారు. వ్యవసాయాధికారి వై.శోభ ఉప్పు నీటితో నిండిన పంట పొలాలను ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం ప్రాంతాల్లో మంగళవారం పరిశీలించారు. మునిగి ఉన్న నారుమడులకు నష్టం తప్పదన్నారు. రైతులు ఇంజిన్లు పెట్టి నీరు బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫలితం ఉండక పోవచ్చన్నారు. జరిగిన నష్టం అంచనా వేస్తున్నామని చెప్పారు. రెగ్యులేటర్ లేకనే తరచూ ఉప్పునీరు: మూడు మండలాల నుంచి 30 వేల ఎకరాల్లో ముంపునీరు దిగే మార్గమున్న కూనవరం మేజర్ డ్రెయి¯ŒSకు సముద్రపు మొగ తెరుచుకుని ఉన్నందున వార్దా తుఫా¯ŒSతో వచ్చిన సముద్రపు పోటు నీరంతా డ్రెయి¯ŒS ద్వారా పంట చేలను నష్టపరిచింది. కూనవరం మొగ వద్ద రెగ్యులేటర్ లేకపోవడం, మేజర్ డ్రైయి¯ŒS నుంచి మైనర్ డ్రెయి¯ŒSలకు ఉన్న మార్గాల్లో షట్టర్లు (లాకులు) లేకపోవడంతో సముద్రపు నీరు నేరుగా పంట పొలాలను తాకింది. భారీ వర్షాల వల్ల వచ్చే ముంపు నీరు కూనవరం మొగ ద్వారానే సముద్రంలో కలవాలి. వర్షాలు లేకపోవడంతో సాధారణ స్ధితిలో ఉన్న డ్రెయిన్లకు ఎగదన్నిన సముద్రపు నీరు డ్రెయిన్ల పొడవునా ఎగబాకింది. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల గట్లు దాటి మరీ ఉప్పునీరు పంట చేలను చెరువుల్లా మార్చేసింది. -
సౌరశక్తి, ఉప్పు నీరు, కొబ్బరి పొట్టుతో సేద్యం
వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన వనరులు.. మట్టి, నీరు, శిలాజ ఇంధనాలు, పురుగుమందులు. ఇవేవీ అవసరం లేని పంటల సాగును ఊహించలేం. కానీ, దక్షిణ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరానికి దగ్గర్లోని ఎడారి ప్రాంతంలో సన్‌డ్రాప్ ఫార్మ్స్‌లో ఇవేవీ అవసరం లేకుండానే టమాటాను సాగుచేస్తున్నారు. సౌరశక్తి సహాయంతో వాణిజ్య స్థాయిలో సాగుతున్న ఈ కృషిలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గత ఆరేళ్లుగా పాలు పంచుకుంటోంది.ఈ విధానంలో ముందుగా సముద్ర జలాలను పైపుల ద్వారా శుద్ధి చేసే ప్లాంట్‌కు తరలిస్తారు. సౌరశక్తితో పనిచేసే ప్లాంట్‌లో ఉప్పు నీటిని శుద్ధి చేస్తారు. సౌర విద్యుదుత్పత్తి కోసం ఈ వ్యవసాయ క్షేత్రం మధ్యలో 23 వేల అద్దాలను అమర్చారు. వీటిపై పడిన సూర్యకాంతిని 115 మీటర్ల ఎత్తున నిర్మించిన టవర్ గ్ర హించి సౌరశక్తి సహాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే 39 మెగావాట్ల విద్యుత్‌ను గ్రీన్హౌస్ నిర్వహణకు, సముద్ర జలాన్ని శుద్ధి చేసే ప్లాంట్‌ను నడిపేందుకు వాడుతున్నారు. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల బారి నుంచి పంటలను కాపాడేందుకు గ్రీన్‌హౌస్‌ను సముద్రపు నీటితో తడుపుతున్నారు. దీనివల్ల వాతావరణ శుద్ధి జరిగి చీడపీడల నివారణకు రసాయనిక కీటకనాశనులు వాడాల్సిన అవసరం తప్పింది. మొక్కలను పెంచేందుకు మట్టికి బదులు కొబ్బరి పొట్టును వాడారు. శుద్ధి చేసిన సముద్ర జలాలతో 1.80 లక్షల టమాటా మొక్కలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి 17 వేల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియాలోని సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కోస్తా తీరానికి దగ్గర్లో ఉండే ఎడారి ప్రాంతాల్లో లేదా ఇసుక నేలల్లో ఈ విధానంలో హరిత గృహాల్లో పంటలను సాగు చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలకు పెట్టే ఖర్చును ఆదా చేయవచ్చు. పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గించవచ్చు. దీని కోసం ప్రారంభంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. చాలా కాలం వరకు పెద్దగా ఖర్చు లేకుండానే దిగుబడులు తీయొచ్చునంటున్నారు. ఈ విధానాన్ని అనుసరించేందుకు పోర్చుగల్, అమెరికా, ఒమన్, ఖతార్ వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇది చాలా ఉపయోగకరమైన విధానమని, భవిష్యత్‌లో ఆహారోత్పత్తుల దిగుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రోబర్ట్ పార్క్ చెప్పారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
ఉప్పునీటి బావే ఊపిరి తీసింది
నందికొట్కూరు: మండల పరిధిలోని దామగట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి మోహన్(15)ను గ్రామంలోని ఉప్పునీటి బావి బలితీసుకుంది. అసలే మూగవాడు, ఆపై ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయాడు. కేకలు వేసే అవకాశం కూడా లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. నాగముని, సాలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, మూగవాడైన కుమారుడు మోహన్ ఉన్నారు. సోమవారం స్కూల్లో జెండా వందనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి పంచాయితీ బోర్డు పక్కన ఉన్న ఉప్పునీటి బావిలో ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి ఈత కొడుతుండగా మోహన్ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించినప్పటికీ పెద్దలు కొడతారనే భయంతో స్నేహితులంతా ఎవరికివారు ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని నీటిలో గాలించి తీసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. -
ప్రమాదంలో కోనసీమ
-
ఉప్పునీటితో రయ్ రయ్...
ఈ స్పోర్ట్స్ కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదూ? కారే కాదు.. దీని ప్రత్యేకతలు మరింతగా మన మదిని దోచుకుంటాయి. సాధారణంగా స్పోర్ట్స్ కార్లు ఎక్కువ పెట్రోలు తాగుతాయి.. తక్కువ మైలేజీ ఇస్తాయి.. వెరసి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. పైగా పర్యావరణానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. కానీ ఈ కారు వాటన్నింటికీ భిన్నమైంది. దీని పేరు క్వాంట్-ఎ-స్పోర్ట్లైమోసిన్. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. అంతేకాదు.. దీనికి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ ఏదీ అవసరం లేదు. మరి ఎలా నడుస్తుందా అని అనుకుంటున్నారా? ఉప్పునీటితో..! ఔను.. పెట్రోల్ బదులు ఉప్పునీరు పోస్తే చాలు.. రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతుంది. దీని గరిష్టవేగం ఎంతో తెలుసా? గంటకు ఏకంగా 350 కిలోమీటర్లు. దాదాపు 2,300 కిలోల బరువున్న ఈ కారు.. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు ట్యాంకులను పూర్తిగా ఉప్పునీటితో నింపితే.. దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. త్వరలోనే ఐరోపా రోడ్లపై ఇది పరుగులు పెట్టనుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ధర కాస్త ఎక్కువే. ప్రస్తుతానికి దీని ధర ప్రకటించకపోయినా, దాదాపు రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా.