ఉప్పునీటిని మంచినీరుగా మార్చే గ్రాఫిన్‌ | graphene-oxide membrane that can turn salt water into potable water | Sakshi
Sakshi News home page

ఉప్పునీటిని మంచినీరుగా మార్చే గ్రాఫిన్‌

Published Sat, Apr 8 2017 6:14 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

ఉప్పునీటిని మంచినీరుగా మార్చే గ్రాఫిన్‌

ఉప్పునీటిని మంచినీరుగా మార్చే గ్రాఫిన్‌

న్యూయార్క్‌: సముద్రంలోని ఉప్పు నీటిని అతి తక్కువ ఖర్చుతో అత్యంత సులభంగా మంచినీటిగా మార్చే ‘గ్రాఫిన్‌ పొర’ను అమెరికాలోని మాంచెస్టర్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ప్రపంచంలో ఎక్కడికైనా ఈ పొరతో కూడిన పాత్రను తీసుకెళ్లి ఉప్పునీళ్లను మంచినీరుగా మార్చుకొని తాగవచ్చు. ఉప్పు నీటి నుంచి లవణాలను తొలగించే ప్రక్రియలో తాము సష్టించిన గ్రాఫిన్‌ పొర విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని ప్రొఫెసర్‌ రవి శిల్వ తెలిపారు.

రాగికన్నా దఢమైన వాహకం, ఉక్కుకన్నా రెండువందల రెట్లు బలంగా ఉండి ర బ్బరుకన్నా తేలిగ్గా వంగే గుణమున్న ‘హానీకోమ్‌ లాటిస్‌’కు కార్బన్‌ అణువులను జోడించడం ద్వారా అద్భుతమైన గ్రాఫిన్‌ మెటీరియల్‌ను తాము ల్యాబ్‌లో సష్టించామని ఆయన చెప్పారు. ఈ గ్రాఫిన్‌ను 2004 సంవత్సరంలోనే తయారు చేయగా, ఇప్పుడు దాన్ని ఉపయోగించి నీటిలో నుంచి ఉప్పును ఎంత సమర్థంగా ఫిల్టర్‌ చేయవచ్చునో కనుగొన్నామని ఆయన చెప్పారు.

భారత దేశంలో సముద్ర జలాలను మంచినీరుగా మార్చే (నిర్లవణీకరణ) అతి పెద్ద ప్లాంట్‌ చెన్నైకి సమీపంలోని కట్టుపల్లి వద్ద ఉన్న విషయం తెల్సిందే. దాన్ని 60 ఎకరాల్లో ఏర్పాటు చేయగా చిన్న స్థాయిలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఫిబ్రవరి నెలలోనే ప్రారంభించారు. ఇలాంటి ప్లాంటులను ప్రపంచంలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ఎకరాల కొద్ది స్థలాలు, కోట్లాది రూపాయల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది.

అయితే మాంచెస్టర్‌ యూనివర్శిటీ పరిశోధకులు గ్రాఫిన్‌ మెటీరియల్‌తో అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ ఫిల్టర్లను తయారు చేసి ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇలాంటి ఫిల్టర్లు మార్కెట్‌లోకి రావడానికి మరెంతకాలం పడుతుందో పరిశోధకులు తెలియజేయలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement