
అకాల వర్షాలతో 11 మంది మృతి
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు 11 ప్రాణాలను బలిగొనగా, 20 లక్షల హెక్టార్లకు పైగా పంటలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి. తమిళనాట మొదలైన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
పగలు, రాత్రి తేడా లేకుండా ఎడా పెడా వర్షం కురవడంతో పాకలు కూలిపోయాయి. పిడుగు పాటు మరికొన్ని ప్రాణాలను బలిగింది. అధికారుల లెక్కల ప్రకారమే భారీ వర్షాల వల్ల 11 మంది మరణించారు. పశు సంపదకు కూడా భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. 36,380 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పాడైనట్లు వెల్లడించారు.