సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సుదీర్ఘంగా సాగిన వివాదానికి ఎలాగోలా తెరపడినా వీలుచిక్కినప్పుడల్లా కత్తి మహేష్ పవన్‌ను టార్గెట్ చేస్తూ టీట్లు చేస్తూనే ఉన్నాడు. పవన్ రాజకీయ ప్రస్ధానంపైనా పంచ్‌లు పేలుస్తూనే ఉన్నాడు. పవన్ అభిమానులు తనను లక్ష్యంగా చేసుకుని చెలరేగినా ఆయన ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్న ఆక్రోశం కత్తి మహేష్‌ను వెంటాడుతున్నట్టే ఉంది.
తాజా ట్వీట్‌లో పవన్‌ను నిలదీస్తూ కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. కత్తి మహేష్ ట్వీట్ పరిశీలిస్తే..‘నటుడు శివాజీ మీద దాడిని ఖండించావు. మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించావు. అప్రజాస్వామికం అన్నావు. బాగుంది. పవన్ కళ్యాణ్ కి నా అభినందనలు. మరి నా మీద నీ అభిమానులు దాడిచేస్తే మాత్రం నీలో స్పందన ఉండదా! నోరు పడిపోతుందా! మనసు రాదా!’ అంటూ పవన్‌ను నిలదీశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నటుడు శివాజీ మీద దాడిని ఖండించావు. మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించావు. అప్రజాస్వామికం అన్నావు. బాగుంది. పవన్ కళ్యాణ్ కి నా అభినందనలు.
— Kathi Mahesh (@kathimahesh) February 22, 2018
మరి నా మీద నీ అభిమానులు దాడిచేస్తే మాత్రం నీలో స్పందన ఉండదా! నోరు పడిపోతుందా! మనసు రాదా!
Comments
Please login to add a commentAdd a comment