
కత్తి మహేశ్
విజయవాడ: సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కులాలు, మతాల మధ్య గొడవలు, మనస్పర్థలు కలిగించే విధంగా కత్తి మహేశ్ వ్యవహరిస్తున్నాడంటూ విజయ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సత్యనారాయణపురం పోలీసులు కత్తి మహేశ్‌పై 153(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.