
సినీ విమర్శకుడు మహేశ్ కత్తి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల వేసిన సెటైర్‌లపై మండిపడ్డారు. ఈ గురువారం జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్‌లో బాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ ముందు పోట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అనే పంచ్‌లు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్ మండిపడ్డారు.
అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ఈ ప్రపంచం. కాస్త భిన్నంగా ఉన్నంత మాత్రనా జోకర్స్ అయిపోతామా.? ఒకరు పొడుగ్గా ఉండొచ్చు.. ఇంకొకరు పొట్టిగా ఉండొచ్చు.. ఒకరు నల్లగా ఉండొచ్చు.. ఇంకొకరు తెల్లగా ఉండొచ్చు.. ఇంకొకరికి నత్తి ఉండి మాట్లాడలేకపోవచ్చు. నాలాగా బట్టతల ఉండొచ్చు. దట్ ఈజ్ మై స్టయిల్. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. అంటూ తన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా హైపర్ ఆదిని ఒక రకంగా పొగుడుతూనే విమర్శించారు.
జబర్దస్త్ షో నేను చూడను, కానీ ఫ్రెండ్స్ పంపే లింక్స్ చూస్తే నాకు ఈ విషయాలు తెలిశాయని చెప్పాడు. అది ఒక గొప్ప షో అని కానీ, గొప్ప కామిడీ ఉంటుందని కానీ నేను అనుకోను. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహస్యం చేస్తున్న దానిని హాస్యం అనుకొని ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. మనందరి దిగజారుడు తనానికి నిదర్శనం అని షో సాగుతున్న తీరునే విమర్శించాడు.
Comments
Please login to add a commentAdd a comment