కత్తి మహేశ్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి ఓబులేసు | Kathi Mahesh Father Says There Are Suspicions Over His Son Death | Sakshi
Sakshi News home page

Kathi Mahesh: మృతిపై అనుమానాలు.. నిజానిజాలు బయటపెట్టాలి

Published Wed, Jul 14 2021 11:16 AM | Last Updated on Wed, Jul 14 2021 6:25 PM

Kathi Mahesh Father Says There Are Suspicions Over His Son Death - Sakshi

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం కత్తి మహేశ్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మహేశ్‌ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు.

కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తండ్రి ఓబులేసు కూడా మహేశ్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేసు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement