సాక్షి, హైదరాబాద్ : సినీ పెద్దల విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శనివారం అన్నపూర్ణ స్టూడియోకు రావడం కొంత ఉద్రిక్తత రేపింది. కత్తి మహేశ్ రావడంతో పవన్ అభిమానులు ఆగ్రహించారు. దీంతో కత్తి మహేశ్‌కు, పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు తనపై దాడికి ప్రయత్నించారని కత్తి మహేశ్ తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ‘అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ లేడు. 24 క్రాఫ్ట్స్ మీటింగ్ లేదు. నేను అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘జై పవర్ స్టార్’ అని నినాదాలు చేశారు. నా కారు మీద దాడికి ప్రయత్నం జరిగింది’ అని కత్తి మహేశ్ పేర్కొన్నారు.
సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మాత్రం వెల్లడించలేదు. ముందుగా ఈ సమావేశానికి పవన్ కూడా హాజరవుతారన్న ప్రచారం జరిగినా.. భద్రతా కారణాల దృష్ట్యా హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment