హైదరాబాద్: ‘పవన్‌కల్యాణ్ అభిమానులు నాపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. దీనిపై పవన్ స్పందిస్తాడని అనుకున్నాను. అయితే ఆయన కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. తన అభిమానులనే అదుపు చేయలేని వ్యక్తి.. రేపు రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు?’అని సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రశ్నించారు. పవన్ సిద్ధాంతాలకు సంబంధించి తాను పది ప్రశ్నలు వేశానని, వాటికి ఇంతవరకూ సమాధానం లేదని చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ అభిమానులతో ముఖాముఖి కోసం తాను ఇక్కడికి వచ్చానని, తన ప్రశ్నలకు పవన్ జవాబు చెప్పాలని, పవన్ తాను చెబుతున్న అంశాలపై చర్చకు రావాలని చెప్పారు.
ఇదే సమయంలో కత్తి మహేష్ ప్రశ్నలకు తాము సమాధానాలు చెబుతామంటూ తెలంగాణ జనసేన నాయకుడు పార్థీపూర్ నర్సింహతో పాటు పలువురు అభిమానులు నినాదాలు చేయడంతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పవన్ అభిమానులను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. ఆ తర్వాత విడిచిపెట్టారు. అనంతరం కత్తి మహేష్ మాట్లాడుతూ.. తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, పవన్ అభిమానులే ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ, మీడియా లేదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. నటి పూనమ్‌కౌర్ చేసిన వ్యాఖ్యలకు తాను ఆరు ప్రశ్నలు సంధిస్తున్నానన్నారు.
పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలివే..
1. చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా పూనమ్‌కౌర్‌కు ఎలా లభించింది?
2. తిరుమలలో పవన్ గోత్రం పేరుతో పూజ చేసింది నిజం కాదా?
3. పవన్ మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా? ఆస్పత్రి బిల్లు ఎవరు కట్టారు?
4. పూనమ్ తల్లిని కలిసిన పవన్ చెవిలో ఏం చెప్పాడు? ఏం ప్రామిస్ చేశారు?
5. దర్శకుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగ్‌తో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు?
Comments
Please login to add a commentAdd a comment