శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్‌ అరెస్టు | Kathi Mahesh Arrested By The Cyber Crime Police Over Commencing Lord Rama | Sakshi
Sakshi News home page

శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్‌ అరెస్టు

Published Sat, Aug 15 2020 4:48 AM | Last Updated on Sat, Aug 15 2020 4:48 AM

Kathi Mahesh Arrested By The Cyber Crime Police Over Commencing Lord Rama - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్‌ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ చేపడుతూ సోషల్‌ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్‌ శ్రీరాముడిపై ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్‌ అధికారుల దృష్టికి రావడంతో సైబర్‌ క్రైమ్‌ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్‌పై గతంలో సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement