సాయిధరమ్‌ 'స్మైలీ' ట్వీట్‌.. మాతృమూర్తిపై కత్తి మహేశ్‌ పోస్టు | sai dharam tej smiley tweet on kathi mahesh? | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 8 2018 7:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

sai dharam tej smiley tweet on kathi mahesh? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌- పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య వివాదం ఎడతెగకుండా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా ప్రెస్‌మీట్‌ పెట్టి.. కొన్ని ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. నటి పూనమ్‌ కౌర్‌కు ఆయన ఆరు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్‌ రంగంలోకి దిగి.. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్టు కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని, కత్తి మహేశ్‌ సైతం టీవీ చర్చలకు వెళ్లకూడదని కోన సూచించారు.

ఈ వ్యవహారం ఇలా ఉండగా పరోక్షంగా కత్తి మహేశ్‌ను ఉద్దేశించి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అయింది. ఓ టీవీ చానెల్‌ చర్చలో తన తల్లిని వివాదంలోకి లాగే ప్రయత్నం చేయడంతో కత్తి మహేశ్‌ ఆ కార్యక్రమంలో మధ్యలోనుంచే వాకౌట్‌ చేశారు. ఈ అంశానికి స్పందన అన్నట్టుగా ’హహ్హహ్హా’అంటూ స్మైలీ ఏమోజీలతో తేజూ ఓ ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే నెటిజన్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ను చేస్తూ.. ఇది కత్తి మహేశ్‌ వాకౌట్‌పై స్పందనే అంటూ కామెంట్లు పెట్టారు. కత్తి మహేశ్‌ను తూలనాడుతూ పలువురు నెటిజన్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తున్నారు.

అమ్మ గురించి కత్తి మహేశ్‌..
'మా అమ్మ క్యాన్సర్‌తో పోరాడుతూ కొన్ని సంవత్సరాల కిందట చనిపోయారు. నా జీవితంలో నన్ను అమితంగా ప్రేమించిన వ్యక్తి, నన్ను బాగా చూసుకున్న వ్యక్తి మా అమ్మే' అంటూ కత్తి మహేశ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. కత్తి మహేశ్‌ తల్లిని వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తూ.. ఆమె జీవితం గురించి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కత్తి మహేశ్‌ తల్లిని వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్న తీరుపై పూనం కౌర్‌ సైతం ట్విట్టర్‌లో స్పందించారు. 'మీ అమ్మ గురించి రహస్యం ఏమిటి' అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. దానిని రీట్వీట్‌ చేస్తూ.. 'అమ్మ ఎవరికైనా అమ్మే.. వారిని వివాదంలోకి లాగడం సరికాదు. ఇది సిన్సియర్‌ రిక్వెస్ట్‌' అంటూ పూనం కౌర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement