
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్‌బుక్‌లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment