
కేటీఆర్, శ్రీరెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై మూడు, నాలుగుసార్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారికి తాను ట్వీట్ చేశానని అయినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదని, మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ట్వీట్లను స్క్రీన్ షాట్లు చేసి శ్రీరెడ్డి తాజాగా చేసి ఎఫ్‌బీ పోస్ట్ వైరల్‌గా మారింది.
'కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. మూవీకి సంబంధించిన పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదు. వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం.'
'సార్, ఇటీవల విడుదలైన మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను'కు మీరు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలపై స్పందించేందుకు మాత్రం సమయంలో ఎందుకు కేటాయించడం లేదు. మీ పీఏ మొబైల్‌కి పలుమార్లు మెస్సేజ్‌లు చేశాను. కానీ స్పందన కరువైంది. మా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పండి సార్' అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.
(సంబంధిత కథనం: ‘సీఎం భరత్’కు కేటీఆర్ ఫిదా)
Comments
Please login to add a commentAdd a comment