derogatory statement
-
కత్తి మహేష్‌పై హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం
-
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
నెహ్రూ, వాజ్‌పేయిలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత అశుతోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆయా నేతల జీవితాల్లో చీకటి కోణాలు ఉన్నాయని.. వారంతా మహిళలతో సంబంధాలు నెరిపారని అశుతోష్ తన బ్లాగులో ఓ వ్యాసం రాశారు. దీనిపై ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయం... 2016లో ఆప్ మంత్రి సందీప్ కుమార్ లైంగిక ఆరోపణల వ్యవహారం తెరపైకి వచ్చింది. సందీప్ ఓ మహిళతో అభ్యంతరకర స్థితిలో ఉన్న సీడీ ఒకటి బయటకు పొక్కటంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి ఆప్ బహిష్కరించింది. ఆ సమయంలో అశుతోష్, సందీప్‌కు అండగా నిలిచారు. తన బ్లాగులో ‘శృంగారం ప్రాథమిక అవసరాల్లో ఒకటి. సందీప్ తప్పేముంది’ పేరిట పెద్ద వ్యాసం రాశారు. దేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖులెందరు లేరు? నెహ్రూ ఎంతో మందితో సంబంధాలు నడిపారు. నెహ్రూ-లేడీ మౌంట్‌బాటెన్ సంబంధం జగమెరిగిన సత్యం. రవీంద్రుడి దూరపు బంధువు సరళాచౌదరి తన ఆత్మిక సతీమణి అని గాంధీజీ అంగీకరించలేదా?. వాజ్‌పేయి వివాహం చేసుకోకపోయినా స్నేహితురాలితో సహజీవనం చేశారు. ఆ మాటకొస్తే గాందీ, నెహ్రూ, వాజ్‌పేయి, రామ్ మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండేజ్ ఇలా అంతా మహిళలతో సంబంధాలు నడిపించారు. వారిని ఎవరూ నిలదీయలేదే?. వారి రాజకీయ ప్రస్థానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాయి కదా’ అంటూ విమర్శకులను తన బ్లాగ్‌లో ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశుతోష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, ఆయన మాత్రం ప్రతిపక్షాలతోపాటు ఆప్ నేతలను కూడా ఏకీపడేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
సాయిబాబా కించపరిచిన స్వరూపానందపై భక్తుల ఆగ్రహం!
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్వరూపానందస్వామిపై షిర్డీ సాయి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను కించపరిచిన స్వరూపానంద క్షమాపణ చెప్పాలని భక్తులు, షిర్డీ సాయి తత్వ ప్రచార కమిటీ డిమాండ్ చేశారు. స్వరూపానందస్వామి తీరుపై సినీనటుడు మోహన్ బాబుతోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.