కత్తి మహేష్‌పై క్రిమినల్‌ కేసు | Crminal Case Files Against Kathi Mahesh In Htderabad | Sakshi

కత్తి మహేష్‌పై క్రిమినల్‌ కేసు

Published Sat, Sep 8 2018 8:29 AM | Last Updated on Sat, Sep 8 2018 8:29 AM

Crminal Case Files Against Kathi Mahesh In Htderabad - Sakshi

కత్తి మహేష్‌

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని అదే రోజు యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా అనంతరం శుక్రవారం కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement