సినీ విమర్శకుడు కత్తి మహేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ను కత్తి మహేశ్ పలు విషయాల్లో విమర్శిస్తుండటం.. అందుకు బదులుగా పవన్ అభిమానులు కత్తిని టార్గెట్ చేసి దుర్భాషలాడటం, బెదిరించడం తెలిసిందే. ఆ తర్వాత టీవీ చర్చల అనంతరం ఈ వివాదం ముగిసినట్టు ఇరువర్గాలు ప్రకటించాయి. కానీ కత్తి మహేశ్ తాజాగా మరోసారి పవన్ అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.