RIP Kathi Mahesh: Tollywood Celebrities Mourn On Kathi Mahesh Death - Sakshi
Sakshi News home page

Kathi Mahesh: కత్తి మహేశ్‌ మరణ వార్తతో షాకయ్యా

Jul 10 2021 6:22 PM | Updated on Jul 11 2021 3:27 PM

Celebrities Mourn The Death Of Kathi Mahesh - Sakshi

గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల బారిన పడ్డ ఫిల్మ్‌ క్రిటిక్‌ కత్తి మహేశ్‌.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నిన్న మొన్నటి వరకూ మహేశ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందనే వార్తలు వచ్చినా పరిస్థితి ఒక్కసారిగా విషమించి కన్నుమూశారు. ప్రధానంగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో కత్తి మహేశ్‌ ప్రాణాలు కోల్పోయారు. కత్తి మహేశ్‌ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కత్తి మహేశ్‌ మరణవార్త విని షాక్‌ గురయ్యానని మంచు మనోజ్‌ ట్విటర్‌లో తెలిపారు. కత్తి మహేశ్‌ ప్రాణాలు కోల్పోయాడనే వార్త కలచివేసింది. కత్తి మహేశ్‌ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని మంచు మనోజ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. టాక్సీవాలా ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌  కత్తి మహేశ్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. మహేశ్‌ ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.


హ్యపిడేస్‌ ఫేం ఆదర్శ్‌ బాలకృష్ణ కత్తి మహేశ్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో కత్తి మహేశ్‌తో గడిచిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నారు. కత్తి మహేశ్‌ అపారమైన జ్ఞానం, ఆసక్తికరమైన భావజాలం కలిగిన వ్యక్తి అని ఆదర్శ్‌ కొనియాడారు. మహేశ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కత్తి మహేశ్‌ మరణవార్త విని షాక్‌ గురయ్యానని నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌లో పేర్కొన్నారు.కత్తి మహేశ్‌ ఎల్లప్పుడూ తన రివ్యూలతో ప్రత్యేకమైన కంటెంట్‌ సినిమాలను ప్రోత్సహించే వారని నాని గుర్తుచేశారు. మహేశ్‌ కుటుంబానికి, స్నేహితులకు సానూభూతిని వ్యక్తపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement