mourned
-
అమెరికాలో సిరివెన్నెలకి తెలుగు వారి నివాళి
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆట, నాటా, నాట్స్, టీటీఏ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఘన నివాళి అర్పించాయి. డాలస్ లో జరిగిన కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు సాహితి మిత్రులు సిరి వెన్నెలకి పుష్పాంజలి ఘటించారు. సిరివెన్నెల సంతాపసభలో మనమంతా కలుసుకోవడం బాధాకరమని తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన అన్నారు. సినీ, సాహిత్య రంగానికి సిరివెన్నెల చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాటా ఉత్తరాధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటిలు మాట్లాడుతూ సిరివెన్నెల మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక మంచి రచయిత, సాహితీవేత్తని తెలుగు జాతి కోల్పోయిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ చెంబోలు సీతారామశాస్త్రి తనకు వ్యక్తిగతంగా చాలా ఆత్మీయులని తెలిపారు. అన్ని సమయాల్లో బావగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారని గతాన్ని నెమరు వేసుకున్నారు. తానా సంస్థతో సిరివెన్నెలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలస్ ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవారని సిరివెన్నెలకు సమీప బంధువు యాజి జయంతి చెప్పారు. తమ ఇంట్లో బస చేసినప్పుడే మురారి సినిమా పాటలు రాశారని చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెలకు నివాళి అర్పించిన వారిలో శారద, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ, విజయ్ కాకర్ల, చినసత్యం వీర్నపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, యుగంధరాచార్యులు, కళ్యాణి, రఘు తాడిమేటి, రమాకాంత్ మిద్దెల, కోట ప్రభాకర్, శ్రీ బసాబత్తిన, ములుకుట్ల వెంకట్, సుందర్ తురుమెళ్ళ, విజయ్ రెడ్డి, రమణ పుట్లూరు, డాక్టర్ కృష్ణమోహన్ పుట్టపర్తి, లోకేష్ నాయుడు, నాగరాజు నలజుల, పరమేష్ దేవినేని, శ్రీకాంత్ పోలవరపు, శాంత, డాక్టర్ విశ్వనాధం, పులిగండ్ల గీత, వేణు దమ్మన, ఎన్ఎంఎస్ రెడ్డి, బసివి ఆయులూరి తదితరులు ఉన్నారు. వీరంతా సిరివెన్నెలతో తమకున్న అనుభంధం, పరిచయం, అనుభూతులను పంచుకున్నారు. చివరగా సిరవెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
కత్తి మహేశ్ మరణ వార్తతో షాకయ్యా
గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల బారిన పడ్డ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నిన్న మొన్నటి వరకూ మహేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉందనే వార్తలు వచ్చినా పరిస్థితి ఒక్కసారిగా విషమించి కన్నుమూశారు. ప్రధానంగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని మంచు మనోజ్ ట్విటర్లో తెలిపారు. కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయాడనే వార్త కలచివేసింది. కత్తి మహేశ్ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని మంచు మనోజ్ ట్విటర్లో పేర్కొన్నారు. టాక్సీవాలా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. మహేశ్ ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్లో పేర్కొన్నారు. హ్యపిడేస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌లో కత్తి మహేశ్‌తో గడిచిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నారు. కత్తి మహేశ్ అపారమైన జ్ఞానం, ఆసక్తికరమైన భావజాలం కలిగిన వ్యక్తి అని ఆదర్శ్ కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని నేచురల్ స్టార్ నాని ట్విటర్లో పేర్కొన్నారు.కత్తి మహేశ్ ఎల్లప్పుడూ తన రివ్యూలతో ప్రత్యేకమైన కంటెంట్ సినిమాలను ప్రోత్సహించే వారని నాని గుర్తుచేశారు. మహేశ్ కుటుంబానికి, స్నేహితులకు సానూభూతిని వ్యక్తపరిచారు. #KathiMahesh is no more. May His Soul Rest In Peace pic.twitter.com/BRbjJw8QEE— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 10, 2021 Shocked & saddened to hear the news about the demise of #KathiMahesh garu. My deep condolences to his family and friends. May his soul rest in peace! Om shanti 🙏 pic.twitter.com/PgFmmk4ct6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 10, 2021 Spent a lot of time with #kathimahesh in the Big Boss House. Was a man of immense knowledge and interesting ideologies. Gone too soon. Deepest condolences to the family 🙏 pic.twitter.com/bGum4yhMOZ — Aadarsh Balakrishna (@AadarshBKrishna) July 10, 2021 Shocked to hear that Kathi Mahesh gaaru passed away. From what I’ve seen, he always tried to encourage films with unique content through his reviews. Strength to his family and friends. — Nani (@NameisNani) July 10, 2021 -
నేపాల్ భూకంప మృతులకు పార్లమెంట్ నివాళి
-
నేపాల్ భూకంప మృతులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ : నేపాల్ భూకంప మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహజన్.... సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్ రాజధాని ఖట్మాండు కేంద్రంగా నమోదైన భూ కంపం వేలాది మంది ప్రాణాలు బలితీసుకుందని...మరెంతో మందిని గాయాలపాలు చేసిందని అందులో పేర్కొన్నారు. భూ కంప తీవ్రత నేపాల్‌తో పాటు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పడిందని అన్నారు. జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని... తీవ్ర ఆవేదనకు గురిచేసిందని స్పీకర్ తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని...నేపాల్ దేశం త్వరలోనే కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించారు. అటు రాజ్యసభ కూడా నేపాల్ మృతులకు సంతాపం ప్రకటించింది. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ హమిద్ అన్సారీ... సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్ రాజధాని ఖట్మాండ్ కేంద్రంగా నమోదైన భూ కంపం....తీవ్ర ప్రభావం చూపిందని, ఇలాంటి సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని అందులో పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని...త్వరగా నేపాల్ తిరిగి కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులందరూ కొద్దిసేపు మౌనం పాటించారు.