సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరో సెటైరిక్ ట్వీట్‌తో వార్తల్లో నిలిచారు. మంత్రులు, తెలుగుదేశం నేతల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ మనోడే అని చేసిన వ్యాఖ్యలపై కత్తి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘"పవన్ కళ్యాణ్ మనోడే!" -తెలుగుదేశం పార్టీ సమావేశంలో కేంద్రబాబు/చంద్రబాబు. తూచ్!!! ఇదేగా నేను ఫస్ట్ నుంచీ చెబుతొంది.’ అని ట్వీట్ చేశాడు.
చంద్రబాబు గురువారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద గ్రీవెన్స్ భవనంలో మంత్రులు, తెలుగుదేశం నేతలతో నిర్వహించిన సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ అతడికి తోచిన విధంగా జేఏసీ పెట్టి ముందుకు వెళుతున్నాడని, మనకు వ్యతిరేకంగా లేడని మంత్రులకు సూచించారు. అతడు ఏర్పాటు చేసిన జేఏసీ వల్ల టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
ఇక అంతకు ముందు ‘పవన్ కల్యాణ్.. ఇచ్చిన గడువు దాటింది, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మీరు ఏమీ చేయలేవని కూడా అంటున్నాయి. మరి తదుపరి కార్యక్రమం ఏమిటో’ కత్తి సోషల్ మీడియా వేదికగా పవన్‌ను ప్రశ్నించారు. ఇక ఆంధ్రా మేదావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రావుపై సైతం కత్తి తనదైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని పిలుపునిచ్చి మౌనం వహించడంపై కత్తి స్పందించారు.
‘ఉద్యమకారులు లెక్కలు తియ్యడంలో కాలయాపన చెయ్యరు. లెక్కలు తేల్చేపనిలో ఉంటారు. చలసాని శ్రీనివాస్ గారూ! మీమీద గౌరవం రెట్టింపు అయ్యింది’. అన్నారు.
కత్తి మహేశ్ ట్వీట్స్
Comments
Please login to add a commentAdd a comment