![Case Filed Against Kathi Mahesh By Cyber Crime Police In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/21/kathi.jpg.webp?itok=iTV0Novi)
సాక్షి, హైదరాబాద్ : సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం మరోసారి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్‌ను పిటీ వారెంట్‌పై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కత్తి మహేష్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. గతంలో శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కేసులో కత్తి మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్‌లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కత్తి మహేశ్‌ను ఆగస్టు 15న సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి : శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment