Vijay Antony's first tweet from hospital after accident - Sakshi
Sakshi News home page

Vijay Antony: విజయ్‌ ఆంటోని కోమాలోకి వెళ్లాడా? ఆస్పత్రి బెడ్‌పై హీరో.. ఫొటో రిలీజ్‌!

Published Wed, Jan 25 2023 10:34 AM | Last Updated on Wed, Jan 25 2023 11:23 AM

Vijay Antony Shares First Tweet From Hospital After Met Accident - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్‌ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్‌లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కొమాలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమాలంత ఆందోళనకు గురవుతున్నారు.

చదవండి: ఎన్టీఆర్‌ వర్థంతి నాడు నాగ్‌ అలా.. ఏఎన్‌ఆర్‌ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..

ఈ క్రమంలో తన ఆరోగ్యంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు విజయ్‌. ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై బాగానే ఉందని, కోలుకుంటున్నానని చెప్పారు. ‘‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) చిత్రీకరణ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. ఈ ఘటనలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ట్వీట్ చేశారు.

చదవండి: ఆనంద్‌ మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గురించిన ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పైనే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న తన ఫోటోని షేర్‌ చేశారు ఆయన. దీంతో ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది. విజయ్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే ట్వీట్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు-2 షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్‌ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement