
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా అపోలో ఆస్పత్రి వర్గాలు దాదా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని.. భయపడాల్సిన పని లేదని వెల్లడించాయి. ఈ రోజు గంగూలీ సాధారణ కార్డియాక్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. అన్ని ముఖ్యమైన పారామీటర్స్ సవ్యంగా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక గతంలోనే గుండెనొప్పితో బాధపడిన గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరోసారి ఆయన ఆస్పత్రికి వెల్లడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది.
(చదవండి: ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది: షమీ)
Comments
Please login to add a commentAdd a comment