
సాక్షి, యశవంతపుర: మంగళూరులో గత ఆదివారం ఇంట్లో జారి పడి ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తల లోపల బలమైన గాయాలై మంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐసీయూలో వైద్యమందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment