
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణా & హైవే, కార్మిక, ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు.
తొలి యూపీఏ ప్రభుత్వంలోని కేబినెట్‌లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు గొప్పవన్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
చదవండి: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతి
Comments
Please login to add a commentAdd a comment