
యశవంతపుర: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆదివారం మంగళూరు లోని అత్తావరలోని నివాసంలో యోగా చేస్తుండగా జారి పడడంతో తలకు దెబ్బ తగిలింది. ఏమీ కాలేదని పట్టించుకోలేదు. అయితే అదేరోజు సాయంత్రం ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా తల లోపల బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు తక్షణం శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment